మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొక విధంగా మాట్లాడడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇష్టపడదు. ఏ విషయాన్ని అయినా తన అభిప్రాయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంతో ఆమె రకరకాల వివాదాలకు కేంద్ర బిందువు అవుతూ వస్తున్నది. చిత్రం ఏమిటంటే కంగనా రనౌత్ మీడియా ముందుకు వస్తే చాలు.. ఆమెను ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి కాంట్రవర్సిలోకి లాగడం ఉత్తారాది మీడియాకు అలవాటుగా మారింది. ఇటీవల ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ హీరో షాహిద్ కపూర్ గురించి చేసిన వ్యాఖ్యలు నూతన వివాదానికి తెర తీసాయి.
Advertisement
Advertisement
2017లో కంగనా రనౌత్, షాహిద్ కపూర్ కలిసి రంగూన్ చిత్రంలో నటించారు. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ సమయంలో కంగనాకు, షాహిద్‌కు మధ్య కోల్డ్ వార్ జరిగింది అనే వార్త అప్పట్లో విశేషం ప్రచారం కొనసాగింది. ఆ సమయంలో కంగనా ఈ విషయమై నోరు మెదపలేదు. కానీ షాహిద్ మాత్రం తమ మధ్య ఎలాంటి గొడవ లేదు అని ఖండించాడు. అయితే ఇంతకాలం తరువాత మరొకసారి ఆ పాత విషయాన్ని మీడియా కంగనా దగ్గర తవ్వింది. షాహిద్ తో రంగూన్ మూవీ సమయంలో గొడవలు ఏమీ జరగలేదా..? అంటూ ఆరా తీసింది. దాంతో ఇప్పటి రోజులను కంగనా తలుచుకుంటూ షూటింగ్ జరిగిన మారుమూల ప్రాంతంలో ఎలాంటి వసతులూ లేవు అని, దాంతో తనకు, షాహిద్ కోసం టెంపరరీగా ఓ కాటేజీని నిర్మించారని.. అందులో గడిపిన రోజులు అన్నీ తనకు పీడకలల మాదిరిగా పరిణమించాయని ఆరోపించింది కంగనా.
నిత్యం ఉదయాన్నే షాహిద్ పెద్ద శబ్దం వచ్చే విధంగా హిప్ హాప్ మ్యూజిక్ పెట్టేవాడు అని, ఓ పిచ్చోడి మాదిరిగా స్పీకర్లో పాటలను పెట్టుకుని వింటూ ఎక్సర్ సైజులు చేసే వాడు అని, కంగనా వివరించింది. అతని బాధ భరించలేక చివరకు దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేసి ఆ కాటేజీలోంచి తన టీమ్‌తో బయటకు వచ్చాను అని చెప్పింది. తన వల్ల ఇతరులు ఇబ్బంది పడుతున్నారనే స్పృహ షాహిద్‌కు లేదని కంగనా వ్యాఖ్యానించింది. ఈ విషయంపై జెస్సీ హీరో షాహిద్ ఏమైనా రియాక్ట్ అవుతాడో లేదో చూడాలి మరీ.