ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ లను వాడుతున్నారు. ప్రస్తుతం అవి ఎన్నో అవసరాలను తీర్చే ఫీచర్లతో, యాప్‌లతో అమర్చబడి ఉన్నాయి. కానీ హ్యాండ్‌సెట్‌లో ఎక్కువ సంఖ్యలో కొత్త ఫీచర్లు ఉండడం వల్ల ఫోన్ బ్యాటరీ వేగంగా అయిపోతుంటుంది. తాజా ప్రాసెసర్, ప్రకాశవంతమైన స్క్రీన్ డిస్ ప్లే, వేగవంతమైన ఇంటర్నెట్ ఫోన్ బ్యాటరీపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోవడానికి పలు కారణాలున్నాయి. ఫోన్ బ్యాటరీ సమస్యను ఎదుర్కొన్నట్టయితే దానిని పరిష్కరించుకోవచ్చు. మీ Android లేదా iPhone బ్యాటరీ కాలాన్ని పెంచే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
బ్యాటరీ ఎక్కువగా వినియోగించే యాప్‌లు ఆఫ్
ప్రజాదరణ పొందిన యాప్‌లు భారీ గ్రాఫిక్స్‌లతో వస్తాయి. ఇవి ఎక్కువగా బ్యాటరీని వినియోగిస్తాయి. ఈ పరిస్థితిలో ఫోన్ నుంచి ఈ యాప్‌లను ఆన్ ఇన్స్టాల్ చేయడానికి బదులు వాటిని బ్యాక్‌గ్రౌండ్ నుంచి తీసేయండి.
wi-Fi యాక్సెస్
Advertisement
కనెక్షన్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచే అలవాటు మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని చాలా వరకు తగ్గిస్తోంది. అందుకే అవసరం లేనప్పుడు మీ wi-Fi కనెక్షన్‌ను డిస్ కనెక్ట్ చేయడం వల్ల మీ డేటాను సేవ్ చేసుకోవచ్చు. మీకు అవసరం అయినప్పుడు మాత్రమే wi-Fi ఉపయోగించండి.
నోటిఫికేషన్లు ఆఫ్
ఫేస్బుక్, ట్విట్టర్ లేదా న్యూస్ వెబ్సైట్ వంటి వాటి నుంచి వచ్చే నోటిఫికేషన్ల వల్ల ఎక్కువగా బ్యాటరీ అయిపోతుంటుంది. మీ బ్యాటరీపై ఒత్తిడి తగ్గించడానికి మీరు అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో దీనిని సులభంగా చేయవచ్చు. యాప్ చిహ్నాన్ని పుష్ చేసి పట్టుకోవడం ద్వారా యాప్ సమాచారం కనిపిస్తోంది. దీని కింద మీరు నోటిఫికేషన్ ఎంపిక ఉంటుంది. దీనిని మీరు ఆన్, ఆఫ్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
పవర్ సేవ్ మోడ్
ప్రతి స్మార్ట్ ఫోన్లో ఫీచర్ తప్పకుండా ఉంటుంది. కానీ చాలా మంది దీనిని ఉపయోగించరు. ఇది మీ ఫోన్ బ్యాటరీ డ్రెయిన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని ఆన్ చేయండి. బ్యాటరీ సేవ్ మోడ్ మీ బ్యాటరీని అయిపోగొట్టే అన్ని ప్రోగ్రామ్‌లను మూసివేస్తుంది. మీ బ్యాటరీ అయిపోతున్నప్పుడు చార్జింగ్ ఛార్జింగ్ ఎంపిక అందుబాటులో లేనప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఆ సూచనలు పాటించి ఛార్జింగ్‌ను పెంచుకోండి ఇలా..!