ఒకపక్క ఐపిఎల్ జోరు సాగుతోంది. క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఐపీఎల్ ఫీవర్ తోనే ఊగిపోతున్నారు. క్రికెట్ లవర్స్ ఎక్కడ కలిసినా కూడా ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ ని పరిశీలిస్తున్నారు కొందరు. జూన్ లో వెస్టిండీస్ వేదికగా ప్రారంభం కాబోయే T20 వరల్డ్ కప్ 2024 లో భారత్ ఏ టీమ్ తో వెళితే బాగుంటుంది అని అంచనాలు వేస్తున్నారు. T20 లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. మిగతా స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కి T20 వరల్డ్ కప్ టీం లో ప్లేస్ కష్టమే అని ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే తన అభిప్రాయాన్ని చెప్పారు.
టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా ఉన్న హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేక పోతే T20 వరల్డ్ కప్ లో టీమిండియా కి ఎంపిక అవుతాడా..? బౌలింగ్ చేయకుండా టీం ఇండియా టాప్ సిక్స్ లో స్థానాన్ని సంపాదించుకోగలడా..? ఒకవేళ బౌలింగ్ చేయకుండా పాండ్యా ని టీంలోకి తీసుకుంటే అది సరికాదని దాన్ని అంగీకరించలేనని చెప్పారు. పాండ్య పవర్ఫుల్గా బ్యాటింగ్ చేయట్లేదు. పైగా బౌలింగ్ కూడా చేయలేకపోతే, బ్యాటింగ్లో కచ్చితంగా మెరుగ్గా రాణించాలి.
Also read:
Also read:
ఈ రెండు చేయకపోతే టీమిండియాలో ఉండడం దండుగ అని హర్ష అన్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 మధ్యలో గాయపడిన హార్థిక్ పాండ్యా కోలుకుని ఐపిఎల్ తో రియంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలుసు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో పాండ్యా మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు. తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పవర్ ప్లే లో బంతిని అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ కెప్టెన్స్ తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ కి రాలేదు ఆర్సిబి తో జరిగిన మ్యాచ్ లో ఒక ఓవర్ మాత్రమే వేశాడు. మొత్తం ఒక ఆల్రౌండర్ గా విఫలమవుతున్న అతనికి టీ20 వరల్డ్ కప్ టీం లో ప్లేస్ దక్కదు అనే వాదన బలంగా వినపడుతోంది. ఇప్పుడు భోగ్లే కూడా అదే చెప్తున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!