బర్రెలక్క గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బర్రెలక్క శిరీష పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆమెకి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా చెప్పింది. మరి ఇంతకీ బర్రెలకు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి ఎవరు..? అతని గురించి పూర్తి వివరాలను చూద్దాం.. సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించిన బర్రెలక్క తన గ్రామం లో బర్రెలు కాసుకుంటూ వీడియోలు చేసేది. ఉద్యోగాలు లేవు అని అందుకనే బర్రెలు మేపుతున్నాను అని శిరీష వీడియోలు చేసింది. అవి వైరల్ అయిపోయాయి. దీంతో బర్రెలక్క బాగా పాపులర్ అయిపోయింది. బర్రెలక్క గత ఎడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది.
Advertisement
దాదాపు 6 వేలు ఓట్లు తెచ్చుకుంది బర్రెలకు నాలుగవ స్థానంలో నిలిచింది. కొల్లాపూర్ నియోజక వర్గం నుండి ఆమె బరిలోకి దిగింది. బర్రెలక్క తరపున జెడి లక్ష్మీనారాయణ ప్రచారం చేయడం కోసమెరుపు. త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బర్రెలక్క పెళ్ళికి సిద్ధమైంది. తన స్వగ్రామంలో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
Advertisement
Also read:
- Pavan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్లకు ఉన్న.. రెండు ఉంగరాల ప్రత్యేకత ఏంటో తెలుసా..?
- AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆరుగురు మాజీ సీఎంల వారసులు..!
- Sreemukhi: శ్రీముఖి చేయి పట్టుకున్న యంగ్ హీరో చెంప పగలగొట్టింది..!
పెళ్లి కుదరడం వలన ఎవరినీ పిలవలేకపోతున్నారని ఆమె చెప్పింది. ఈమె ని పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి అదృష్టవంతుడు అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శిరీష బర్రెలు కాయట్లేదు వాటిని అమ్మేసింది. ఈ మధ్య బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ శిరీష పెళ్లి అని ప్రచారం జరిగింది. ఈ వార్తల మీద శిరీష స్పందించింది పల్లవి నాకు అన్నయ్య తో సమానం అని చెప్పింది. తనతో నాకు పెళ్లి ఏంటి అని మండిపడింది ఏదైతేనేమి ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకోబోతోంది. ఆమె పెళ్లి చేసుకోబోతున్న వరుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!