Home » శ్మ‌శానం వ‌ద్ద రంద్రాలు.. క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే అద్భుత‌మే..!

శ్మ‌శానం వ‌ద్ద రంద్రాలు.. క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే అద్భుత‌మే..!

by Anji
Ad

క‌డ‌ప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగ‌ర్భ రిజ‌ర్వాయ‌ర్ ట్యాంక్ వెలుగులోకి వ‌చ్చిన‌ది. చింత‌కొమ్మ‌దిన్నె మండ‌లం ఊటుకూరు గ్రామం స‌మీపంలో 1890లో బ్రిటీషు వారు నిర్మించిన రియ‌జ‌ర్వాయ‌ర్ ట్యాంక్ వెలుగులోకి రావ‌డంతో ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో దాన్ని చూడ‌డానికి త‌ర‌లి వ‌స్తున్నారు. 132 ఏండ్ల క్రితం క‌డ‌ప‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు పాలించిన సంద‌ర్భంలో తాగునీటి అవ‌స‌రాల కోసం ఊటుకూరు వ‌ద్ద ప‌దిబోర్లు భూగ‌ర్భ రిజ‌ర్వాయ‌ర్ ట్యాంక్‌లో నీటిని నిలువ చేసుకునేవారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడూ వాటిని గ్రావిటీ ద్వారా క‌డ‌ప క‌లెక్ట‌రేట్‌కు తీసుకెళ్లేవారు అని స్థానికులు పేర్కొంటున్నారు. అద్భుత‌మైన క‌ట్ట‌డంతో ఎలాంటి సిమెంట్‌, కాంక్రీట్ వాడ‌కుండా కేవ‌లం గ‌చ్చుతో నిర్మించిన ట్యాంకు నీటికి చెక్కుచెద‌ర‌కపోవ‌డం విశేషం.

Kadapa: శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు..  దిగి చెక్ చేయగా అద్భుతం | British Era Underground Reservoir Found in Kadapa  Andhra Pradesh | TV9 Telugu

Advertisement

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేటి త‌రుణంలో కాంక్రీట్ సిమెంట్‌తో క‌ట్ట‌డాలు, మంచినీటి ట్యాంకులు నిర్మించినా 50 ఏళ్ల‌కే ప్ర‌శ్నార్థ‌కమ‌వుతున్న సంద‌ర్భాలున్నాయి. అలాంటిది దాదాపు 132 సంవ‌త్స‌రాల కింద ఎలాంటి సిమెంట్ వాడ‌కం లేకుండా కేవ‌లం సుద్ద‌గ‌చ్చుతో నిర్మించిన భూగ‌ర్భ మంచినీటి ట్యాంకు. బ్రిటీష్ కాలంలో 1890లో తాగునీటి అవ‌స‌రాల కోసం నిర్మించిన భూగ‌ర్భ మంచినీటి రిజ‌ర్వాయ‌ర్ ట్యాంకు ఇప్పుడు వెలుగులోకి రావ‌డంతో దానిని చూడ‌డానికి ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్నారు. క‌డ‌ప జిల్లా చింత కొమ్మ‌దిన్నే మండ‌లం ఊటుకూరు రెవెన్యూ గ్రామ ప‌ర‌ధిలో ల‌క్ష‌ల లీట‌ర్ల సామ‌ర్థ్యంతో 1890లో భూగ‌ర్భ మంచినీటి ట్యాంక్‌ను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు నిర్మించారు. బుగ్గ‌వంక ప్రాజెక్ట్ స‌మీపంలో బుగ్గ శివాల‌యం వ‌ద్ద ప‌ది బోర్లు వేసి అక్క‌డి నుంచి గ్రావిటీ ద్వారా క‌డ‌ప న‌గ‌రానికి గ‌తంలో తాగునీటి స‌ర‌ఫ‌రా కొన‌సాగేది.

British-era cistern found in Kadapa- The New Indian Express

Advertisement

వేస‌వికాలంలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు బ్రిటిషు పాల‌కులు ఇక్క‌డ భూగ‌ర్భ మంచినీటి ట్యాంక్ నిర్మించుకున్న‌ట్టు తెలుస్తోంది. రెవెన్యూ రికార్డుల్లో మంచినీటి ట్యాంక్ గా ఉన్న‌ట్టు సిబ్బంది చెబుతున్నారు. ఇక్క‌డి నుంచి క‌డ‌ప పాత క‌లెక్ట‌ర్ బంగ్లా వ‌ర‌కు నీటిని తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. భూగ‌ర్భ రిజ‌ర్వాయ‌ర్ ట్యాంక్ నిర్మాణం చేప‌ట్టిన విధానం ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌కుండా క‌నిపిస్తోంది. భూమి ఉప‌రితలంపైన ట్యాంకు కోసం ఏర్పాటు చేసిన 15 రంద్రాలున్నాయి. గ‌తంలో వాటికి ఇనుప మూత‌లు ఏర్పాటు చేసినా.. కాల‌క్ర‌మేనా ఇవి చోరీకీ గురైన‌ట్టు స్థానికులు చెబుతున్నారు. భూమి ఉప‌రిత‌లం పై నున్న రంద్రం నుంచి కిందికి దిగ‌గానే అద్భుత‌మైన క‌ట్ట‌డాల‌తో లోప‌ల సుంద‌రంగా క‌నిపిస్తుంది నిర్మాణం. ఎలాంటి సిమెంట్‌, కాంక్రీట్ లేకుండా కేవలం సుద్ద‌గ‌చ్చుతో ట్యాంకు నిర్మాణం చేప‌ట్టారు. ట్యాంకు లోప‌లికి నీళ్లు రావ‌డానికి ఓ రంద్రం ట్యాంకు నుంచి బ‌య‌టికీ నీళ్లు త‌ర‌లించేందుకు మ‌రొక రంద్రం ఏర్పాటు చేసారు. లోప‌లి భాగంలో అద్భుత‌మైన ఆర్కిటెక్ష‌ర్ విధానం క‌నిపిస్తోంది. గోతిక ఆర్చ్ ప‌ద్ద‌తిలో నిర్మాణం చేప‌ట్టిన‌ట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

Kadapa: శ్మశానం దగ్గర్లోని నిర్మానుష్య ప్రాంతం వద్ద కనిపించిన రంధ్రాలు..  దిగి చెక్ చేయగా అద్భుతం | British Era Underground Reservoir Found in Kadapa  Andhra Pradesh | TV9 Telugu

లోప‌లి భాగంలో 11 వ‌రుస‌ల్లో 44 వ‌ర‌కు గోతిక ఆర్చ్‌లు క‌నిపిస్తున్నాయి. గ‌వ్వ సున్నంతో చేసిన గ‌చ్చుతో నిర్మాణం చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికీ క‌ట్ట‌డం చెక్కు చెద‌ర‌కుండా ఉండ‌డం నిర్మాణంలో తీసుకున్న జాగ్ర‌త్త‌ల‌కు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. ఇప్పుడు క‌డ‌ప న‌గ‌రానికి పెన్నా న‌దిలోని గండి, లింగంప‌ల్లి వాట‌ర్ వ‌ర్క్స్ నుంచి తాగునీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇవిలేని స‌మ‌యంలో తొలుత క‌డ‌పకు నీటిని స‌ర‌ఫ‌రా చేసిన ప్రాంతం మాత్రం ఊటుకూరు వ‌ద్ద ఉన్న బ్రిటీషు కాలం నాటి మంచినీటి ట్యాంకు ద్వారానే గ‌తంలో సిద్ధ‌వ‌టం జిల్లా కేంద్రం నుంచి క‌డ‌ప‌కు మారిన స‌మ‌యంలో బ్రిటిష్ వారు తాగునీటి అవ‌స‌రాల కోసం ఈ విధానం అవ‌లంభిస్తున్న‌ట్టు నిపుణులు పేర్కొంటున్నారు.ఊటుకూరు వ‌ద్ద ఉన్న సంప్ నుంచి పైపు లైన్ల ద్వారా క‌డ‌ప ఎర్ర‌ముక్క‌ప‌ల్లె వ‌ర‌కు నీటిని త‌ర‌లిస్తున్నారు. ప్ర‌స్తుతం భూగ‌ర్భ ట్యాంకు మాత్రం వృథాగా క‌నిపిస్తోంది.

Visitors Are Also Reading