Home » సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే..!

సన్‌రైజర్స్ ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే..!

by Anji
Ad

మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2024 ప్రారంభమవుతుంది. గత రెండు సీజన్ల నుంచి ప్లే-ఆఫ్స్‌కు కూడా క్వాలిఫై కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఎలాగైనా చక్కటి ఆటతీరును కనబరచాలని చూస్తోంది. ఐపీఎల్ 2023, 2022, 2021.. గడిచిన మూడు సీజన్ల నుంచి ఆరెంజ్ ఆర్మీ నిలకడలేమితో సతమతమవుతోంది. అంతేకాదు టీం మేనేజ్‌మెంట్.. తమ కీ ప్లేయర్స్‌పై ఎలాంటి నమ్మకం ఉంచకపోవడం కూడా జట్టు అపజయాలకు పెద్ద కారణమైంది. అయితే ఐపీఎల్ 2024లో తమ రాత మార్చుకునేందుకు సిద్దమైంది. వన్డే వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కు సారధ్య పగ్గాలు అప్పగించిన హైదరాబాద్ ఫ్రాంచైజీ.. వేలంలో జట్టుకు అవసరమైన కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది.

Advertisement

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతడు ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఇక జట్టుకు ప్యాట్ కమ్మిన్స్ ‘ఎక్స్’ ఫ్యాక్టర్‌గా నిలవనున్నాడు. అతడి అంతర్జాతీయ అనుభవం, అలాగే కెప్టెన్సీ స్కిల్స్‌ హైదరాబాద్ జట్టును గాడిలో పడేసేందుకు ఉపయోగపడుతాయి. 2016లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ సారధ్యంలోనే సన్‌రైజర్స్ ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్ కలిసొస్తుందని యాజమాన్యం భావిస్తోంది. బ్యాటింగ్‌‌లో ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. అయితే ఇంతమంది ఉన్నా కూడా.. మిడిలార్డర్‌లో ఒకరిద్దరు కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోతే కష్టమే.

Advertisement

 

ఈసారి ఎస్‌ఆర్‌హెచ్ పేస్ ఎటాక్‌ను స్వయంగా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ చూసుకోనున్నాడు. అతడి నాయకత్వంలో టి.నటరాజన్, మార్కో యాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ చెలరేగిపోతారు. వీరితో పాటు ఆల్‌రౌండర్లు గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్ కూడా ఉన్నారు. జట్టులోని స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపించినా.. మయాంక్ మార్కండే, వనిందు హసరంగా ఆ లోటును భర్తీ చేయగలరు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే.. హైదరాబాద్ బ్యాటింగ్ 40 శాతంగా ఉంటే.. బౌలింగ్ 60 శాతంగా ఉంది. ఏది ఏమైనా.. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సరైన టీమ్ కాంబినేషన్‌ను రూపొందించడం కొత్త కెప్టెన్ పాట్ కమ్మిన్స్‌కు పెద్ద సవాల్ అనే చెప్పాలి.

Also Read :  ఐపీఎల్ నుంచి హ్యారీబ్రూక్ దూరం.. ఎందుకో తెలుసా ?

Visitors Are Also Reading