Home » సీఎం జగన్ గొప్ప మనస్సు.. గీతాంజలి కుటుంబానికి రూ.20లక్షలు సాయం

సీఎం జగన్ గొప్ప మనస్సు.. గీతాంజలి కుటుంబానికి రూ.20లక్షలు సాయం

by Anji
Published: Last Updated on
Ad

 సోషల్ మీడియా  ప్రస్తుతం ట్రోలింగ్ ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల మొదలు.. సామాన్యుల వరకు ఎవరకీ భద్రత లేకుండా పోయింది. చేసిన సాయం గురించి కూడా నాలుగు మంచి మాటలు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. సీఎం జగన్ వల్ల నేను లబ్ధి పొందాను అంటూ ఒక తల్లి తన ఆనందాన్ని వెల్లడించడమే మహా పాపం అయిపోయింది. చివరకు ప్రాణాలు తీసుకునేలా ఉసిగొలిపారు. ఇప్పుడు వారు చేసిన పనికి ఇద్దరు చిన్నారులు తల్లిలేని వాళ్లు అయిపోయారు. గీతాంజలి విషయంలో సీఎం జగన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు.

geetanjali-family

Advertisement

 

సోషల్ మీడియాలో పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయి. ఏ మాట అంటే ఎవరు ట్రోల్ చేస్తారో? ఏ అభిప్రాయం పంచుకుంటే ఎలాంటి తంటాలొస్తాయో అని వణికిపోయేలా చేస్తున్నారు. ఒక వర్గం మాత్రం ఇలాంటి పనులకే పూనుకుని ఉంది. అలాంటి వాళ్ల వల్లే ఒక తల్లి తన ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు కూతుళ్లను వదిలేసి అర్ధాంతరంగా తనువు చాలించింది. అలా చేసేలా ఆమెను ఉసిగొలుపుతూ.. నెట్టింట నానా హింసలకు గురి చేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి సీఎం జగన్ అండగా నిలిచారు. గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి, ఆ ఇద్దరు చిన్నారులకు అండగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

 

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. గీతాంజలి ఆత్మహత్య, ఆ కుటుంబం దీనస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గీతాంజలి విషయం తెలుసుకుని సీఎం జగన్ చలించిపోయారన్నారు. వెంటనే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేయాలని ఆదేశింcచిన విషయాన్ని వెల్లడించారు. ఆ బిడ్డలకు తల్లిలేని లోటు తీర్చలేము. ఆ పసి బిడ్డల కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఆదేశించిన విషయాన్ని హరికృష్ణ వెల్లడించారు. అలాగే ఈ విషాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇప్పటికీ గీతాంజలిపై నెట్టింట అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కనిపించడం నిజంగా దారుణం అనే చెప్పాలి.

Also Read :   జగన్ మీద పోటీ చేసి ఓడిపోవడం నాకు చాలా ఇష్టం.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ వైరల్

Visitors Are Also Reading