అందం కోసం వర్కౌట్లు చేయడం మేకప్ లు వేసుకోవడం సహజమే. కానీ కొంతమంది సెలబ్రెటీలు అందం కోసం అంతకు మించి చేస్తుంటారు. అంతకు మించి చేయడం అంటే అందం కోసం ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం. అలా చాలా మంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎలాంటి సర్జరీలు చేసుకోకుండా నాచురల్ అందాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలా సర్జరీలకు దూరంగా ఉండి ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ ముద్దుగుమ్మ, సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకునే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకునే ఇప్పటి వరకూ ఒక్క సర్జరి కూడా చేసుకోలేదు.
Advertisement
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ కూడా ఒక్క సర్జరీ చేయించుకోలేదు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తు టాలీవుడ్ కు సైతం అలియా భట్ దగ్గరయ్యింది.
Advertisement
ఇక టాలీవుడ్ తో పాటూ కోలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న హీరోయిన్ సాయిపల్లవి. ఫిదా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను సాయిపల్లవి ఫిదా చేసింది. ఇక సాయిపల్లవి తన డ్యాన్స్ టాలెంట్ తో మరియు నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ అందం కోసం సాయిపల్లవి కూడా ఒక్క సర్జరీ కూడా చేయించుకోలేదు.
బాలీవుడ్ లో గ్లామరస్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా కపూర్ కూడా ఇప్పటి వరకూ సర్జరీల జోలికి వెళ్లలేదు. శ్రద్దా ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
Also read : ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టి ఆ తప్పుతో కెరీర్ నాశనం చేసుకున్న 5గురు హీరోయిన్లు..!