Home » ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టి ఆ త‌ప్పుతో కెరీర్ నాశ‌నం చేసుకున్న 5గురు హీరోయిన్లు..!

ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టి ఆ త‌ప్పుతో కెరీర్ నాశ‌నం చేసుకున్న 5గురు హీరోయిన్లు..!

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా అంటే ఒక్క హిట్టు కొట్టి రెస్ట్ తీసుకుంటామంటే స‌రిపోదు. వ‌రుస హిట్లు ప‌డాలి అంతే కాకుండా వ‌రుస హిట్లు ప‌డితేనే గుర్తింపు కూడా ఉంటుంది. వ‌రుస ఫ్లాపులు ప‌డ్డాయంటే కెరీర్ ముగిసిన‌ట్టే. ఇక హీరోయిన్ల కెరీర్ అయితే మ‌రీ దారుణం ముందుగా హిట్లు పడి ఆ త‌ర‌వాత క‌థ‌ల ఎంపిక‌లో చేసే మిస్టేక్ ల వ‌ల్ల ఫ్లాపులు ప‌డితే కెరీర్ ముగిసిన‌ట్టే. అలా టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు క‌నుమ‌రుగ‌య్యారు. ఆ హీరోయిన్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

neha sharma

neha sharma

చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ మొద‌టి సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుంది. సైజ్ జీరో అందాల‌తో మ‌తిపోగొట్టింది. ఆ త‌ర‌వాత కుర్రాడు అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తోంది.

Advertisement

ఇడియ‌ట్ సినిమాలో ర‌వితేజ‌కు జోడీగా న‌టించిన బ్యూటీ ర‌క్షిత‌. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక మొద‌టి సినిమానే బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచినా ఆ త‌ర‌వాత చేసిన ఆంద్రావాలా, నిజం సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డంతో ఇండ‌స్ట్రీలోనే క‌నుమ‌రుగు అయ్యింది. ప్ర‌స్తుతం గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది.

Advertisement

isha chawla

isha chawla

ప్రేమ‌కావాలి సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ ఇషా చావ్లా. సాయికుమార్ జోడీగా ఇషా చావ్లా న‌టించిన ప్రేమ‌కావాలి మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర‌వాత క‌థ‌ల ఎంపిక‌లో చేసిన మిస్టేక్స్ తో టాలీవుడ్ కే దూరం అయ్యింది.

kartheeka

kartheeka

ప్ర‌ముఖ హీరోయిన్ రాధ కూతురుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ కార్తీక‌. మొద‌టి సినిమా రంగం మంచి విజ‌యం సాధించింది. నాగ‌చైత‌న్య స‌ర‌స‌న జోష్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ కు జోడీగా ద‌మ్ము సినిమాలో న‌టించి హిట్ అందుకుంది. కానీ ఆ త‌ర‌వాత మాత్రం అవ‌కాశాలు అందుకోలేక‌పోయింది.

anita hamsa nandini

anita hamsa nandini

నువ్వానేనా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అనితా హంస‌నందిని. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర‌వాత మాత్రం క‌థ‌ల ఎంపిక‌లో స‌రైన నిర్న‌యం తీసుకోక‌పోవ‌డంతో కెరీర్ కు పులిస్టాప్ ప‌డింది. ప్ర‌స్తుతం హిందీ సిరియ‌ల్స్ లో న‌టిస్తోంది.

Also Read: భారత్, పాక్ సరిహద్దు లో పుట్టిన బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా..?

Visitors Are Also Reading