భారత యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్‌తో వివాదంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన గిల్ మరోసారి అధ్భుత ప్రదర్శనతో భారత్ కు భారీ స్కోర్ అందించాడు. వన్డే తరహాలో ధాటిగా ఆడిన గిల్ 12 ఫోర్లు, 5 సిక్స్ లు బాదీ ఔరా అనిపించాడు. అయితే ఈ క్రమంలోనే అండర్సన్ బౌలింగ్ సిక్స్ కొట్టడంతో బౌలర్ కాస్త దురుసుగా వ్యవహరించాడు. దీనిపై మ్యాచ్ అనంతరం మాట్లాడాడు శుభ్ మన్ గిల్.
Advertisement
‘మా నాన్న కోరుకున్నట్లుగా నేను ఆడుతున్నా. అదే స్థాయిలో ప్రదర్శన చేస్తున్నా. తప్పకుండా నా ఆట పట్ల నాన్న గర్వంగా ఫీల్ అవుతారు. బంతిలో అనుకున్నంత మేర కదలిక లేదు. బ్యాట్ మీదకు అస్సలు రాలేదు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే, కాస్త అడ్వాంటేజ్ తీసుకుని అండర్సన్ బౌలింగ్‌లో దూకుడు ప్రదర్శించా. ప్రతిసారీ మంచి ప్రదర్శనే ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటా. కొన్నిసార్లు భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమవుతున్నా.
Advertisement
English breakfast, @bhogleharsha 😄#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/lpGcswxqHj
— JioCinema (@JioCinema) March 8, 2024
కానీ నాణ్యమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాననే అనుకుంటా. ఇక అండర్సన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన తర్వాత జరిగిన చాటింగ్ గురించి మాట్లాడటం బాగోదు. మేం ఏం అనుకున్నామనేది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిదని నా ఫీలింగ్’ ఏమీ చెప్పకుండా దాటవేశాడు. మరోవైపు గిల్ తండ్రి లిఖ్విందర్ తన కుమారుడు ఓపెనర్ గా రావాలని చెబుతుండటం గమనార్హం.
Also Read : సన్ రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్ .. అధికారికంగా ప్రకటించిన ఫ్రాంఛైజీ..!