బిగ్‌బాస్ బ్యూటి హిమజ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్‌లో ఉంది. ఇల్లు కట్టుకుంటున్నాడని.. ముందు ఆమె వీడియో పెట్టగా అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు పెళ్లి అయిందనే విషయమే ఆమె ఇప్పటిదాకా వెల్లడించలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని.. దీంతో త్వరలోనే విడాకులు కూడా ఇవ్వనున్నట్టు రూమర్స్ వినిపించాయి. అయితే ఆ విషయం గురించి పెద్దగా రచ్చ జరుగుతుండటంతో తాజాగా ఆమె విడాకులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై హిమజ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేసినది.
Advertisement
Advertisement
అసలు ఈ చర్చ ఎలా మొదలు అయిందో తెలియడం లేదు. ఈ మధ్య యూట్యూబ్ లోనే పెళ్లిళ్లు విడాకులు చేసేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి నేను పట్టించుకోను. కానీ మా పేరెంట్స్ కాస్త సున్నితంగా ఉంటారు. ఇలాంటి వదంతుల వల్ల వాళ్లు ఎక్కువ బాధపడతారు. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేయకండి. అదేవిధంగా నా పెళ్లి, విడాకులు నన్ను కూడా పిలవండి అంటూ వ్యంగ్యంగా ఆమ పేర్కొన్నది. అయితే తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని ఖండించిన ఆమె మూడు, నాలుగేళ్లలో పెళ్లి తప్పకుండా చేసుకోవాలనే ఆలోచన ఉన్నది.. ఒకవేళ చేసుకుంటే చాలా గ్రాండ్‌గా అందరికీ చెప్పి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అంతేకాదు మంచి వాడిని కూడా మీరే చూడండి అని ఆమె కోరింది. గత కొద్ది రోజులుగా నా వీడియోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో కొందరూ కుట్ర పన్ని ఇలాంటి ఫేక్ న్యూస్‌లు క్రియేట్ చేస్తున్నారని ఆమె వెల్లడించింది.