సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా వెలుగొందిన ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. ప్రియమణి నటించిన తాజా చిత్రం ఆర్టికల్ 370. ఆదిత్య సుహాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో యామీ గౌతమితో పాటు ప్రియమణి కూడా కీలక పాత్ర పోషించారు. సంచలనాలు, వివాదాలకు కేంద్ర బిందువులా మారిన ఈ సినిమాలో ప్రియమణి నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రియమణి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
‘ఆర్టికల్ 370’ ని కొందరు రాజకీయ ప్రచారం కోసం మలిచిన సినిమా అంటున్నారు. మరికొందరు జనాల్లో చైతన్యం తీసుకొస్తున్న చిత్రంగా అభివర్ణిస్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. కానీ ఈ చిత్రం కేవలం వాస్తవిక సంఘటనల ఆధారంగానే తెరకెక్కింది. మేము ఆర్టికల్ 370 వెనక ఉన్న చరిత్ర, వాస్తవాలు, జరిగిన సంఘటనలు తెలియజెప్పాం. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అనేది ప్రభుత్వం తీసుకున్న ఓ సాహసోతమైన నిర్ణయం. సాధారణంగా ఇలాంటివి అమలు సందర్భాల్లో తీవ్ర ఘర్షణలు చెలరేగుతుంటాయి. ఎన్నో ప్రాణాలు పోతుంటాయి. అదృష్టవశాత్తు అలాంటి అల్లకల్లోలం చెలరేగలేదు. ఒక్క ప్రాణమూ పోలేదు. ఈ విషయంలో నేను గర్వపడుతుంటాను అని వెల్లడించారు.
Advertisement
“వాస్తవానికి ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు.. నాకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 గురించి తెలియదు. కథలోని.. సున్నితత్వంపై పెద్దగా అవగాహన లేదు. అయితే చిత్రీకరణకు ముందే ఎన్నో లోతైన విషయాలు తెలుసుకున్నా. ఇందులో నేను ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేసే ఓ కీలకమైన ఐఏఎస్ అధికారిణిగా నటించాను. పాత్రల పరిధి, కథలో మార్పులుచేర్పుల.. విషయంలో ప్రతి సినిమాకి.. దర్శకుడు, నటీనటులకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. కానీ ‘ఆర్టికల్ 370’ అలా కాదు. అచ్చంగా వాస్తవిక సంఘటన ఆధారంగానే తెరకెక్కించాలి. 370 ఆర్టికల్ రద్దు సమయంలో జరిగిన విషయాలే చూపించాలి. మేమూ అదే చేశాం. ఇది కొందరికి నచ్చలేదనుకుంటా. కానీ మా అంతిమ లక్ష్యం జనాన్ని చైతన్యం చేయడమే” అని చెప్పుకొచ్చారు ప్రియమణి.
Also Read : ప్రశాంత్ నీల్ ఇంట్లో ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. కారణం అదేనా ?