Home » మన దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు ఇవే..!

మన దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు ఇవే..!

by Anji
Ad

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ కీలకమైన ఘట్టం. ముఖ్యంగా మనదేశంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఘనంగా వివాహ వేడుకలు జరిపించేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. మరికొందరైతే అప్పులు తెచ్చి మరీ పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక మరకొందరు రిజిస్టర్‌ మ్యారెజ్‌ లాంటి సాధాసీదా వివాహాలు చేసుకుంటారు. ప్రస్తుతం ముకేష్‌ అంబానీ రెండో కొడుకు అనంత్‌ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికల వివాహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుక జరగనుంది. అలాగే జులై 12న వివాహం జరగనుంది. అయితే వివాహ వేడుకలు ప్రారంభం నుంచి ముగిసేవరకు మొత్తం రూ.1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇంత ఖర్చు అయితే.. దేశంలో అత్యంత ఖరీదైన పెళ్లిగా ఇది నిలిచిపోనుంది. మన ఇండియాలో ఇంతకుముందు భారీగా డబ్బులు ఖర్చు చేసి జరిపించిన కొన్ని పెళ్లిల్ల గురించి తెలుసుకుందాం.

radhika-background

Advertisement

మొదటగా.. మనదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే అందిరికీ టక్కున గుర్తొచ్చేది ముకేశ్ అంబానీ పేరు. ఈయన కూతురు ఇషా అంబానికి ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ పిరమల్‌ కొడుకు ఆనంద్‌ పిరమల్‌తో 2018లో విహహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి దాదాపు రూ.742 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటివరకు జరిగిన పెళ్లిల్లలో అదే ఖరీదైన పెళ్లి. ఈషా వివాహం.. ముంబై, ఉదయ్‌పూర్‌, ఇటలీ ఇలా మూడు ప్రదేశాల్లో ఘనంగా జరిపించారు ముకేశ్ అంబానీ.

Advertisement

 

ఇక రెండవది సహారా చీఫ్‌ సుబ్రతా రాయ్‌ కొడుకులు సుషాంతో రాయ్‌, సీమంతో రాయ్‌ల పెళ్లికి కూడా చాలా ఖర్చు చేశారు. 2004లో జరిగిన ఈ ఇద్దరు సోదరుల పెళ్లికి దాదాపు రూ.556 కోట్లు ఖర్చు చేశారు. ఇక మూడవది.. అక్రమ మైనింగ్‌ ఆరోపణలు ఎదుర్కొన్న గాలి జనార్ధన్‌ రెడ్డి కొడుకు రాజీవ్‌ రెడ్డి వివాహం.. బ్రాహ్మణ రెడ్డితో 2018లో జరిగింది. అయితే ఈ పెళ్లి కోసం ఏకంగా దాదాపు రూ.549 కోట్లు ఖర్చు చేశారు. అలాగే స్టీల్‌ కింగ్‌ అయిన లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ మేనకోడలు సృష్టికి.. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌ అయిన గుల్రాజ్‌ బెహల్‌తో 2013లో వివాహం జరిపించారు. ఈ పెళ్లికి రూ.519 కోట్లు ఖర్చు చేశారు.

 

 వనీషా మిట్టల్‌ అమిత్‌ భాటియా వివాహానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అలాగే 2011లో కాంగ్రెస్ లీడర్‌ కొడుకు లలిత్‌ అండ్‌ వారి పెళ్లి జరిగింది. ఇందుకోసం దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేశారు. దుబాయ్ వ్యాపారవేత్త అదిల్‌ షాజన్‌ ఓ లగ్జరీ క్రూయిజ్‌లో సనాఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. దీనికోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. బ్రిటన్‌లోని సంపన్న కుటుంబానికి చెందిన సంజయ్‌ హిందూజా.. ఓ డిజైనర్‌ను ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి అయిన ఖర్చు దాదాపు రూ.140 కోట్లు.

 

2013లో జరిగిన ఈ వివాహాని కి దాదాపు రూ.519 కోట్లు ఖర్చు చేశారు. ఇక నాలుగు ఐదవది వనీషా మిట్టల్ అమిత్ భాటియా పెళ్లికి దాదాపు అయిన ఖర్చు 400 కోట్లు. ఇక ఆరవది కాంగ్రెస్ లీడర్ కుమారుడు లలిత్ అండ్ వారి వివాహం 2011లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఖర్చు ఏకంగా 250 కోట్లు. ఇక ఏడవది డైరెక్టర్ అదిల్ షాజన్ ఓ విలాసవంత మైన క్రూయిజ్‌లో సనా ఖాన్‌ ను పెళ్లాడారు. దీని కోసం ఆయన ఖర్చు చేసింది అక్షరాల రూ.200కోట్లు. బ్రిటన్‌‌ లోని సంపన్న కుటుంబానికి చెందిన సంజయ్ హిందూజా.. డిజైనర్ అను మహతి ని పరిణయమాడారు. ఉదయ్‌పూర్‌ లో జరిగిన ఈ పెళ్లి వేడుక ఖర్చు వచ్చేసి రూ.140కోట్లు అయింది.

Also Read :  అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి.. రామ్ చరణ్, ఉపాసన..!

Visitors Are Also Reading