ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేసినా కానీ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో వాహనం ఎంత నడపాలి అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా.. ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని పలువురు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
Advertisement
ఇలాంటి ప్రమాదం ఒకటి మలేషియాలో చోటు చేసుకున్నది. ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వెళ్లుతుండగా.. సడెన్గా బండి కిందపడిపోయింది. కిందపడిన వెంటనే వెనుక నుంచి కారు దూసుకొచ్చిన విషయాన్ని గమనించి పక్కకు తప్పుకున్నాడు. క్షణాల వ్యవధిలోనే రెండు ప్రమాదాలను తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు రోడ్డు పక్కనే పార్కు చేసిన ఒక కారులోని డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డు అయ్యాయి. ఒళ్లు గొగుర్పొడిచే ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Advertisement