భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో డార్లింగ్ మునుపెన్నడు చూడని పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ సినిమాలో తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Advertisement
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘వందల కోట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. నేను ప్రాజెక్ట్ కె లో కూడా నటిస్తున్నాను. అలాగే మహేష్ బాబుతో ఓ సినిమా కూడా చేస్తున్నాను’ అని అన్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో మాత్రం ఎప్పటిదనేది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఇదే నిజమైతే.. మొదటిసారి ప్రభాస్, రాజేంద్ర ప్రసాద్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
Advertisement
#Kalki2898AD lo Nenu Act chestuna! 🔥 — Rajendra Prasad pic.twitter.com/LEnA9KWh4S
— :/ (@charanvicky_) February 29, 2024
ఇటీవలే గుర్గావ్ లో జరిగిన సినాప్స్ 2024లో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తుందని.. ఇందుకు సరికొత్త ప్రపంచాలనే సృష్టించామని అన్నారు. ఈ మూవీలోని పాత్రలన్ని ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయని… భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా చేశామని అన్నారు. అందుకు ఓ ఊహా ప్రపంచాన్ని రూపొందించామని.. క్రీ.శ. 3102 నుంచి క్రీ.శ 2898 వరకు మొత్తం 6000 సంవత్సరాల వెనుక కథను సిద్ధం చేశామని అన్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
Also Read : బిగ్ బాస్ తరువాత వాళ్లు బ్యాన్ చేశారు.. అలీ రెజా ఎమోషనల్ కామెంట్స్..!