సాధారణంగా చదువు ముగిసిపోయిన తరువాత.. ఏం జాబ్ చేస్తున్నావ్.. రా అని తెలిసిన వాళ్లు తరచూ ఏదో ఒక సందర్భంలో ప్రశ్నిస్తుంటారు. ఇంజినీర్, డాక్టర్, ఏదైనా ఉద్యోగం చేస్తున్నానని చెప్పే వాళ్లకు మర్యాద ఇస్తారు. చిన్న టీ హోటల్ పెట్టుకున్నాను. సమోసాలు, బజ్జీలు వేసే పని చేస్తున్నానంటే.. ఏంటీ ఇలాంటి పనులు చేస్తున్నావా అని కొంచెం చులకనగా చూస్తుంటారు. వాస్తవానికి ఎవ్వరూ ఏ వృత్తి చేసినా కూడా అందులో ప్రతిభను చూపిస్తే.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవచ్చు. దీనినే మహారాష్ట్రకు చెందిన ఓ టీ అమ్మే వ్యక్తి నిరుపించాడు. ఇతని టీ షాప్‌కు ఏకంగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వచ్చి.. టీ ని ఆస్వాదించారు.
Advertisement
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వాసి సునీల్ పాటిల్.. డాలీ చాయ్‌వాలాగా సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నారు . ఇతను టీ తయారు చేసే విధానానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతేకాదు సునీల్ పాటిల్ టీ తాగేందుకు నిత్యం ఎంతోమంది క్యూలు కడుతుంటారు. సోషల్ మీడియాలో ఇతని వీడియోలు ఇప్పటికే కోట్లాది మంది చూశారు. అయితే ఇటీవల ఇండియాకు వచ్చిన బిల్‌గేట్స్.. సునీల్ పాటిల్ తయారు చేసిన టీ ని ఆస్వాదించారు.
Advertisement
తొలుత బిల్‌గేట్స్ వన్ ఛాయ్ ప్లీజ్ అని అంటారు. ఆ తర్వాత సునీల్ తనదైన శైలిలో టీ ని తయారు చేస్తూంటే.. బిల్‌గేట్స్ ఆసక్తిగా చూశారు. ఆ తర్వాత టీ ని తాగారు. అంతేకాదు ఈ వీడియోకి ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇండియాలో ఎక్కడ చూసినా ఆవిష్కరణలు కనిపిస్తాయని.. ఆఖరికి సాధారణ టీ కప్పులో కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటీజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. టీ ఇచ్చేటప్పుడు ఆయన బిల్‌గేట్స్ అని గుర్తుపట్టలేదని సునీల్ తెలిపారు. ఏదో ఒకరోజు ప్రధాని మోదీకి టీ ఇవ్వాలని ఉందని.. తన కొరికను చెప్పారు. ప్రస్తుతం బిల్ గేట్స్ టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : ముకేష్ అంబానీ, నీతా అంబానీల ఫేవరేట్ ఫుడ్స్ ఇవే..!