Home » జగన్ నా నాలుగో పెళ్లాం.. నాలుగో వదిన బావుంది అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్..!

జగన్ నా నాలుగో పెళ్లాం.. నాలుగో వదిన బావుంది అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్..!

by Anji
Ad

పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎన్నికల వరకు రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. అప్పటివరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో 24 స్థానాల్లో, 3 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. మిగిలిన వారిని గెలుపు గుర్రాలను వెలికితీసే పని ఉన్నారు పవన్ కళ్యాణ్.

Advertisement

Advertisement

ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ మొన్న తాడెపల్లిగూడెంలో జరిగిన జనసేన-టీడీపీ జెండా బహిరంగ సభలో పవన్ ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా నాలుగు పెళ్లిళ్ల వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ” మాట్లాడితే నాకు నాకు నాలుగు పెళ్లిళ్లు అంటున్నారు. ఆ నాలుగో పెళ్లాం జగనే” అని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతున్నాయి. ప్రధానంగా జనసైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ ను మహిళగా మార్చి ఫొటోలు ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టుల కింద కూడా కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. మా నాలుగో వదిన చాలా బాగుంది అన్నయ్య అంటూ కొందరూ కామెంట్స్ చేస్తూ.. నాలుగో పెళ్లి ఎప్పుడు అయింది అన్న అంటూ మరికొందరూ కామెంట్స్ పెడుతున్నారు.  ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read :  తెలంగాణ లాసెట్-2024 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే..?

Visitors Are Also Reading