తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు నటుడు అక్కినేని నాగార్జున. నాగార్జున ఇండస్ట్రీలో హీరోగా దాదాపు 35 ఏళ్ల నుంచి కొనసాగుతున్నాడు. నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి మంచి సక్సెస్ సాధించాడు. నాగార్జున కెరీర్ ప్రారంభంలో చేసిన కొన్ని సినిమాల్లో ఆయనతో పాటు కాంబినేషన్ లో నటించే నటులు మూడు, నాలుగు టేక్ లు తీసుకుంటే నాగార్జునకి చిరాకు పుట్టేదట.
Advertisement
కొంత మంది నటులు అలా చేస్తే నాగార్జున కి ఓపిక నశించి అన్ని టేకులు ఎందుకు తీసుకుంటున్నారు అని అరిచేవాడట. అలా ప్రధానంగా రావు గోపాల రావు లాంటి సీనియర్ నటుడి మీద సైతం నాగార్జున అరిచినట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి. నాగార్జున ఇండస్ట్రీకి రాక ముందే తండ్రి నాగేశ్వరరావు నాగార్జునతో షూటింగ్ లో ఎక్కువ టేకులు తీసుకోకూడదని.. మన డైలాగ్స్ ఫటాఫట్ చెప్పేయాలి.. సెట్ లో మన వల్ల సమయం వేస్ట్ అవ్వకూడదని చెప్పాడట. అందుకే నాగార్జున ప్రారంభం నుంచే డైలాగ్ లను ఫటా ఫట్ చెప్పేసేవాడట.
Advertisement
ముఖ్యంగా నాగార్జునకి మెమొరీ పవర్ చాలా ఎక్కువగానే ఉంటుందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో నాగార్జున ఫాస్ట్ గా డైలాగ్ లు చెప్పేవాడట. కొన్నిసారు కొంత మంది డైలాగ్ లు మరిచిపోవడం కానీ.. లేదా తడబడటం కానీ చేసినట్టయితే నాగార్జున అస్సలు ఊరుకునేవాడు కాదట. అలా కొన్ని సార్లు సీనియర్ నటుల మీద కూడా కోప్పడ్డట్టు వార్తలు వినిపించాయి. మొత్తానికి కింగ్ నాగార్జున ఇండస్ట్రీలో 35 సంవత్సరాలు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడంటే.. మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.