మాస్ దర్శకుడు పూరిజగన్నాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో పోకిరి ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో ముఖ్యంగా హీరోల క్యారెక్టరైజేషన్లు, డైలాగ్స్, కామెడీ ట్రాక్ చాలా వెరైటీగా ఉంటాయి. పోకిరి సినిమాలో అలీ, బ్రహ్మనందం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అయితే పూరిజగన్నాథ్ సినిమాలకు తొలుత వేరే టైటిల్స్ అనుకున్నారని.. ఎన్నో డిస్కష్కన్స్ తరువాత ఫైనల్ గా టైటిల్స్ ఫిక్స్ అయిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అలా అనుకున్న టైటిల్స్ ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం.
Advertisement
పోకిరి :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం పోకిరి. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ మిట్ సాధించింది. అప్పటివరకు ఉన్న కలెక్షన్లు అన్నింటిని.. రికార్డులను కూడా తిరిగరాసింది. సినిమా ఆ రేంజ్ రావడానికి టైటిల్ ఓ కారణం అయింది. ఈ చిత్రానికి తొలుత అనుకున్న టైటిల్ ఉత్తమ్ సింగ్ . కానీ చివరికీ పోకిరీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.
బద్రి :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మూవీ బద్రి. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య రేణుదేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ సాధించింది. అయితే ఈ చిత్రానికి తొలి టైటిల్ చెలి అనుకున్నారట. పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి ఆ టైటిల్ మరీ క్లాస్ అయిపోతుందని భావించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్.. బద్రిగా మార్చారు.
Advertisement
చిరుత :
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ.. తెరకెక్కించిన చిత్రం చిరుత. ఈ మూవీకి తొలుత కుర్రాడు అనే టైటిల్ పెట్టాలనుకున్నారట పూరి. లో క్లాస్ ఏరియా అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఈ టైటిల్ చిరంజీవి తనయుడికి సరిపోయేలా లేదని భావించి ‘చిరుత’నయుడు అర్థం వచ్చేవిధంగా ‘చిరుత’ టైటిల్ ఫైనల్ చేశాడు పూరి.
ఆంధ్రావాలా :
ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఆంధ్రావాలా’. పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా అందర్నీ నిరాశ పరచింది. ఈ సినిమాకి మొదట ‘కబ్జా’ అనే టైటిల్ అనుకున్నారు. చాలా రోజుల వరకు అదే టైటిల్‌తో కంటిన్యూ అయ్యారు. చివరికి ‘ఆంధ్రావాలా’ అనే టైటిల్ అయితే బాగుంటుందని మార్చారు.
ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం :
వాస్తవానికి పూరి జగన్నాథ్ ఎక్కువ సినిమాలను చేసింది మాస్ మహారాజా రవితేతోనే. ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, నేనింతే.., అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి విభిన్నమైన టైటిల్స్ తో వచ్చాయి. వీటిలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకి తొలుత జీవితం అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. ఈ టైటిల్ నార్మల్ గా ఉందని.. టైటిల్ లో నెగెటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయని గమనించి పూరి జగన్నాథ్ దానిని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం గా మార్చారు. ఇలా పూరి తన సినిమాలకు ఫస్ట్ అనుకున్న టైటిల్ ఒకటి అయితే.. మరో టైటిల్ ని మార్చారు.
Also Read : తెలుగు సినిమాల పై నటుడు రవి కిషన్ షాకింగ్ కామెంట్స్..!