ఏపీ తెలంగాణలో కల్తీ పాల దందా జోరుగా సాగుతోంది. దేశంలోనే కల్తీ పాల దందాలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నెంబర్ 1 స్థానంలో ఉండటం కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా కేటుగాళ్ళు కల్తీ పాలతో సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతమైన సంగారెడ్డిలో పవిత్ర డైరీ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కల్తీ పాలను తయారుచేసి హెరిటేజ్ అమూల్ లాంటి బ్రాండ్ స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. దాంతో పోలీసులు గుర్తించి దాడులు చేశారు.
Advertisement
ఇదిలా ఉంటే కల్తీ పాలల్లో ప్రాణాంతకమైన రసాయనాలతో ను కలపడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఆవుల నుండి లేదా గేదెల నుండి తీసిన పాలను స్వచ్ఛమైన పాలు అంటారు. ఇక కల్తీ పాల విషయానికి వస్తే ఇందులో చిక్కదనం కోసం యూరియా, సన్ ఫ్లవర్ ఆయిల్ ఇలాంటి వాటిని కలపడం వల్ల పాలకు చిక్కదనం వస్తుంది. ప్రస్తుతం కల్తీ పాలను కేటుగాళ్లు అదే విధంగా తయారు చేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన పవిత్ర డైరీ విషయానికి వస్తే అక్కడ కల్తీ పాలు పెరుగు తయారీ కోసం డిటర్జెంట్, స్టార్చ్, యూరియా వాడినట్లు తెలుస్తోంది.
Advertisement
మంచి వాసన కోసం రక రకాల రసాయనాలను పాలు, పెరుగు తయారీలో వాడుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా గంటల వ్యవధిలోనే ఈ రసాయనాలతో గడ్డ పెరుగు తయారు చేసి అమ్ముతున్నారు. పాలు పెరుగుకు ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు ఇలాంటి రసాయనాలను వాడుతున్నారు. కేవలం డైరీల లో మాత్రమే కాకుండా పల్లెటూర్ల నుండి వస్తున్న పాలలో కూడా చిక్కదనం కోసం యూరియా, వెన్న శాతం కోసం పామ్ ఆయిల్ కలుపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇక కల్తీ పాలు పాలలో కలిపే క్లాస్టిడియం ఈకోలై, సాల్మోనెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా లతోపాటు రోటా వైరస్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలను తాగటం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లం, అల్సర్లు, వాంతులు-విరేచనాలు, మానసికంగా ఎదగని ఇవ్వకపోవడం, అదేవిధంగా ఈ పాలను తాగడం వల్ల క్యాన్సర్ల బారిన పడే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.