Home » పార్టీ కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్ ?

పార్టీ కోసం సొంత ఆస్తులను అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్ ?

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాబోయే ఎన్నికల ఖర్చు, సామాజిక కార్యక్రమాల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్వయంగా తాను సంపాదించిన ఆస్తులను అమ్మకాలు జరిపి జనసేన పార్టీ కోసం రూ.100 కోట్ల ఫండ్ ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనే విషయం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

సాధారణంగా సినిమాల్లో రోజుకు రెండు కోట్లు సంపాదిస్తాడు పవన్ కళ్యాణ్. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లో ఆయనకు మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దామని వచ్చిన పవన్.. ఇప్పుడు తన బ్యాంకు అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ కి వచ్చే స్థితికి వచ్చాడు. పార్టీ నిర్వహణకు అభ్యర్థులను నిలబెట్టేందుకు డబ్బులు లేకపోతే ముందుకు పోలేని పరిస్థితి నెలకొంది. పవన్ కళ్యాన్ సినిమాల్లో నటించి సంపాదించుకున్న ఆస్తులు ఒక్కొక్కటి అమ్ముతున్నట్టు ఓ వార్త బయటికీ వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రూ.20కోట్ల విలువ గల స్థలాన్ని ఇప్పటికే అమ్మేసినట్టు తెలుస్తోంది. ఇదే తరహాలో మరికొన్ని స్థలాలను కూడా పవన్ బేరాలు చేయడం మొదలు పెట్టారట. గత నెలలోనే రూ.10కోట్లు పార్టీ ఫండ్ గా ఇచ్చారు.

Advertisement

 

తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును కూడా ఆయనే భరించాలని డిసైడ్ అయ్యాడట. ఒక్కో అభ్యర్థికి రూ.20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారట. గతంలో పవన్ తన పిల్లల పేర్ల మీద ఫిక్స్ డ్ చేసిన డిపాజిట్లను ఏపీలోని జనసేన కార్యాలయ నిర్మాణం ఖర్చు చేశారు. తాను నటించిన సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ని బాధితులు.. పలుచోట్ల రైతులకు విరాళంగా అందించిన విషయం తెలిసిందే. 2024లో ఎన్నికల కోసం ఎవ్వరి వద్ద పార్టీ ఫండ్ తీసుకోవడానికి నిరాకరించిన పవన్ తన సొంత ఆస్తులను అమ్మాలని నిర్ణయించుకున్నారట. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు తమ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ ఆస్తుల అమ్మకం వ్యవహారం ట్రెండింగ్ అవుతోంది.

Also Read :  టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కలిగిన హీరో ఎవరు ? టాప్ లో ఉన్నది ఏ హీరో అంటే ?

Visitors Are Also Reading