మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 01న వీరిద్దరి వివాహం ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. 2017 నుంచి సీక్రెట్ గా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. గత ఏడాది జూన్ లో నిశ్చితార్థంతో తమ లవ్ గురించి బయటపెట్టారు. మిస్టర్ మూవీ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తరువాత ప్రేమగా మారింది. కానీ లవ్ విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉన్నారు. గత ఏడాది ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్ మెంట్, పెళ్లి జరిపోయాయి.
Advertisement
వీరిద్దరి ప్రేమ విషయం మాత్రం అటు అభిమానులతో పాటు.. ఇటు మెగాస్టార్ చిరంజీవికి కూడా చివరి నిమిషం వరకు తెలియదట. ఈ విషయాన్ని స్వయంగా చిరునే చెప్పాడం గమనార్హం. వరుణ్ పై ఇప్పటికీ కోపంగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన చిరంజీవి.. వరుణ్, లావణ్య లవ్ స్టోరీ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుమ మాట్లాడుతూ.. చిరు లీక్స్ మాకు చాలా ఇష్టం.. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మీరు లీక్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేశాం. కానీ వరుణ్, లావణ్య లవ్ స్టోరీని ఎలా చేయకుండా.. మీకు కూడా లీక్ చేయలేదా అనే సందేహం ఉండిపోయింది అంటూ చిరును అడిగింది.
Advertisement
దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. “వరుణ్ నాతో ప్రతి విషయం చెబుతాడు. కానీ ఈ విషయంలో మాత్రం చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. నేను ఇన్ స్పిరేషన్ అని చెబుతుంటాడు. ఈ లీక్స్ విషయంలో నా నుంచి ఇన్స్పెర్ అయి లావణ్యతో డేటింగ్ విషయం చెప్పాలి. తన తండ్రికి కూడా చెప్పని విషయాలను వరుణ్ నాతో చెబుతాడు. కానీ ఇది చెప్పనందుకు ఇప్పటికీ వరుణ్ పై నాకు కోపంగానే ఉంది” అంటూ నవ్వుతూ రియాక్ట్ అయ్యాడు. దీనిపై నువ్వేమానా సంజాయిషీ ఇస్తావా వరుణ్ అంటూ సుమ అడగ్గా.. ‘అది గౌరవంతో కకూడిన భయం.. అందుకే జాగ్రతగా ఉన్నాను. కానీ మా ఫ్యామిలీలో ఫస్ట్ చెప్పింది పెదనాన్నకే ‘ అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : ఆ పాత్ర మీ బావ చేస్తాడా..? అల్లు అరవింద్ కి ఆ స్టార్ హీరో కౌంటర్..!