దివంగత సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నాగేశ్వరరావు నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. తొలుత ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీంతో నాగార్జున కెరీర్ అనేది పూర్తిగా డౌన్ అయిపోతుందని నాగేశ్వరరావు చాలా దిగులుగా ఉండేవాడు. దీంతో అప్పుడే నాగార్జున రామ్ గోపాల్ వర్మతో ఓ భారీ యాక్షన్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టు ఆర్జీవీ నాగార్జునకి చెప్పాడట. దీంతో నాగార్జున ఆర్జీవీని నమ్మి ఆయనకు ఆ మూవీ చేసే అవకాశాన్ని ఇచ్చాడు.
Advertisement
Advertisement
రామ్ గోపాల్ వర్మ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సీన్లలో డైలాగ్స్ ని సెట్ లోనే రాస్తూ.. చేంజేస్ చేస్తూ షూట్ చేసేవారట. ఇది చూసిన రామ్ గోపాల్ వర్మ మీద చాలా సీరియస్ అయి ఆయనను సెట్ లోనే అందరి ముందు తిట్టాడట. నమ్మి ఇన్ని డబ్బులు పెడుతున్నప్పుడు ప్రాపర్ గా సీన్లను ముందే రాసుకొని పెట్టుకొవాటి కదా సెట్ లోకి వచ్చిన తరువాత ఎందుకు ఈ చేంజ్ చేస్తున్నావ్ అంటూ అందరి ముందే ఆయన అనడంతో వర్మకి ఆయన మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించాయట. నాగార్జున మాత్రం అవన్ని పట్టించుకోకు. మనం చేయాల్సిన సినిమాను మనం చేసుకుంటూ ముందుకు వెళ్దామని వర్మతో చెప్పేవాడట.
ఇక అప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ అవేవి పట్టించుకోకుండా సినిమా మీదన ఎక్కువ ఫోక్ చేసి.. సినిమాకి బెస్ట్ అవుట్ పుట్ వచ్చే విధంగా ప్రయత్నం చేశాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. నాగార్జున కెరీర్ లోనే అప్పటివరకు ఉన్న సినిమాల్లో ది బెస్ట్ మూవీగా మంచి గుర్తింపు తెచ్చుకుది. అదే ఆర్జీవీ-నాగార్జున కాంబోలో వచ్చిన శివ మూవీ.
Also Read : ఒక్కడు సినిమా నుంచి కృష్ణ నమ్రత ను తప్పించడానికి కారణం ఏంటో తెలుసా ?