తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా రాణించారు దర్శకుడు కోడి రామకృష్ణ. దాదాపు 100 కి పైగా సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా ఒకతరం అగ్ర హీరోలందరితో కూడా దర్శకుడు కోడి రామకృష్ణ మంచి విజయాలను అందించారు. ఏయే హీరోతో ఏమేమి హిట్ సినిమాలు అందించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కృష్ణ :
కృష్ణ-కోడి రామకృష్ణ కాంబినేషన్ లో పోరాటం చిత్రం సూపర్ హిట్ అయింది. అలాగే గూండా రాజ్యం, గూఢచారి నెం117 కూడా ప్రేక్షకులను మెప్పించాయి.
చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతోనే కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కోడి రామకృష్ణ-చిరంజీవి కాంబోలో చాలా సినిమాలే వచ్చాయి. ఆలయ శిఖరం మాత్రమే చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
బాలకృష్ణ :
నందమూరి బాలకృష్ణ నటించిన ‘మంగమ్మ గారి మనవడు’ వంటి సంచలన చిత్రంతో మొదలైన బాలయ్య – కోడి రామకృష్ణ కాంబో.. ఆపై ‘ముద్దుల కృష్ణయ్య’, ‘ముద్దుల మావయ్య’, ‘మువ్వ గోపాలుడు’, ‘ముద్దుల మేనల్లుడు’ వంటి బ్లాక్ బస్టర్స్, హిట్ మూవీస్ వచ్చాయి.
Advertisement
నాగార్జున:
‘మురళీ కృష్ణుడు’ రూపంలో నాగార్జున, కోడి రామకృష్ణ కాంబోలో చెప్పుకోదగ్గ విజయం ఉంది.
వెంకటేష్ :
‘శత్రువు’ రూపంలో వెంకీ, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఘనవిజయం ఉంది. దీనికంటే ముందు వచ్చిన ‘శ్రీనివాస కళ్యాణం’ కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
సుమన్:
‘తరంగిణి’ వీరి కాంబోలో బిగ్గెస్ట్ హిట్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే ’20వ శతాబ్దం’ కూడా జనరంజక చిత్రంగా నిలిచింది.
రాజశేఖర్:
రాజశేఖర్ తో కోడి రామకృష్ణ రూపొందించిన సినిమాల్లో ‘అంకుశం’ సంచలన విజయం సాధించింది. అంతకంటే ముందు వచ్చిన ‘తలంబ్రాలు’, ‘స్టేషన్ మాస్టర్’, ‘ఆహుతి’ కూడా మంచి విజయం సాధించాయి.
అర్జున్:
‘మా పల్లెలో గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘మా వూరి మారాజు’, ‘పుట్టింటికి రా చెల్లి’.. ఇలా అర్జున్, కోడి రామకృష్ణ కాంబోలో మంచి విజయాలే ఉన్నాయి.
జగపతి బాబు :
జగపతి బాబుతో కోడి రామకృష్ణ తీసిన సినిమాల్లో ‘దొంగాట’ ఘనవిజయం సాధించగా.. ‘పెళ్ళి పందిరి’ కూడా విజయపథంలో పయనించింది.
Also Read : జయలలిత రాజకీయ నాయకురాలు అవుతుందని తొలుత చెప్పిన హీరో ఎవరో మీకు తెలుసా?