Home » టైటానిక్ తర్వాత.. శ్రీ రాములయ్యనే ఆ రికార్డు ని క్రియేట్ చేసింది..!

టైటానిక్ తర్వాత.. శ్రీ రాములయ్యనే ఆ రికార్డు ని క్రియేట్ చేసింది..!

by Sravya
Ad

టైటానిక్ సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు 1997 వ సంవత్సరంలో విడుదలైన టైటానిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను ఆకట్టుకుంది ప్రపంచ సినిమాని ఏకం చేసింది ఈ సినిమా. ఆరోజుల్లో టైటానిక్ సృష్టించిన సంచలనం ఇంత అంత కాదు. తెలుగు నగరాల్లో ప్రధాన ఏరియాలో 100 డేస్ ని కూడా ఈ సినిమా జరుపుకుంది ఇప్పటివరకు వరల్డ్ మొత్తం మీద వచ్చిన బెస్ట్ లవ్ మూవీ కూడా ఇది టైటానిక్ వచ్చిన రెండేళ్ల కంటే 1999లో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అండగా నిలిచిన పోరాటయోధుడు రాములయ్య జీవిత కథ ఆధారంగా శ్రీరాములయ్య మూవీ వచ్చింది. ఈ సినిమా టైటానిక్ తర్వాత సినిమా గా నిలబడి చరిత్రలో తనకంటూ ఒక రికార్డుని సొంతం చేసుకుంది. మరి ఇంతకీ ఈ సినిమా రికార్డు ఎందులోకి ఎక్కింది..? ఇక సినిమా ఏ రికార్డుని క్రియేట్ చేసింది అనేది చూద్దాం.

Advertisement

Advertisement

ఈ సినిమాలో ప్రతి షాట్ కూడా ఎంతో వైవిధ్యంతో కూడుకుని ఉంది ప్రతి సీన్ ని కూడా మన కళ్ళ ముందు జరుగుతుందేమో అనే విధంగా కెమెరా తో తీశారు. టైటానిక్ తర్వాత ఒకేలా క్రేన్ తో షాట్ తీసిన రెండవ సినిమాగా శ్రీ రాములయ్య సినిమా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. మూవీ ప్రారంభంలో టైటిల్స్ పడుతుండగానే శ్రీ రాములయ్య సమాధిని చూపించడం జరుగుతుంది. ఈ సీన్ ని రకరకాల షాట్స్ లో టాప్ యాంగిల్ లో చూపించారు.

ఒక హెలికాప్టర్ కి కట్టి ఆ షార్ట్ తీశారు. ప్రముఖ దివంగత నేత పరిటాల రవి తండ్రి రాములయ్య జీవిత కథ ఆధారంగా రాములయ్య సినిమా ని తెరకెక్కించారు. ఎన్ కౌంటర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టైటిల్ రోల్ లో మోహన్ బాబు అలానే ఆయన భార్యగా సౌందర్య నటించారు. శ్రీ రాములయ్య కొడుకు రవిగా కూడా మోహన్ బాబు నటించారు. దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు ఈ సినిమాలో పాటలు ఇప్పటికి కూడా చాలా చోట్ల వినపడుతూనే ఉంటాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading