పూర్వం మన ఇళ్లలో తాగునీరు రాగి పాత్రలలోనే నిల్వ చేసేవారు. వాస్తవానికి రాగి పాత్రలలో నింపిన నీరు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రాచీనులు చాలా కాలం క్రితమే అర్థం చేసుకున్నారు. ఆయుర్వేదం కూడా రాగి పాత్రలలో నిల్వ చేసిన నీటి ప్రయోజనాలను పేర్కొంది. ఆయుర్వేదం ప్రకారం.. వాత, కఫ, పిత్త దోషాల నుంచి బయటపడేందుకు రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం మంచిదని చెబుతుంటారు. కానీ నేటి కాలం మారింది. ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది ప్రజలు తాగునీటిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్, స్టీల్ లేదా గాజు సీసాలు వాడుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాల పరంగా తాగునీటిని నింపడానికి రాగి పాత్రలు అత్యంత అనుకూలమైనవి.
Advertisement
Advertisement
ముఖ్యంగా రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి బలపడుతుంది. ఈ నీరు బరువు తగ్గడం, కీళ్లనొప్పులు, కొలెస్ట్రాల్, అధిక బీపీకి కూడా మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాగి పాత్రలలో నీటిని దాదాపు 6 నుండి 8 గంటల పాటు ఉంచినట్లయితే, అది స్వచ్ఛమైన నీరు రూపాంతరం చెందుతుంది. రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగితే కిడ్నీ, కొలెస్ట్రాల్, రక్తహీనత వంటి వ్యాధులు దరిచేరవు. రాగి పాత్రలో నీటిని నిల్వ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రధానంగా రాగి బిందేలు, బాటిళ్లలో నీటిని క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రాగి పాత్రల్లో ఆ నీటిని కనీసం 8 గంటలపాటు ఉంచాల్సి ఉంటుంది. రాగి పాత్రలో 48 గంటల పాటు నీటిని నిల్వ చేసిన నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ కాలం రాగి పాత్రలో నిలువ ఉన్న నీటిని తాగకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Also Read : రాత్రి పడుకునే చిన్న బెల్లం ముక్క తింటే చాలు.. ఆ వ్యాధులకు చెక్..!