ఆయుర్వేదంలో బెల్లం దివ్యౌషధంగా చెబుతారు.. ముఖ్యంగా చల్లని వాతావరణంలో రాత్రి భోజనం తర్వాత బెల్లం తింటే శరీరానికి అమృతంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం శరీరానికి వేడిని అందించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు కూడా ఇందులో ఉన్నాయి. కొంతమంది బెల్లంకు బదులుగా పంచదారను వాడుతుంటారు. పంచదార కంటే బెల్లం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. రాత్రి పడుకునే ముందు చిన్న బెల్లం తింటే చాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.
Advertisement
Advertisement
- బెల్లం అన్ని రకాల కడుపు సమస్యలకు సులభమైన పరిష్కారం. రాత్రిపూట బెల్లం తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.
- చలికాలంలో మీకు తరచుగా జలుబు, దగ్గు వస్తుంటే బెల్లం తీసుకోవడం ప్రారంభించండి. రాత్రిపూట బెల్లం తింటే జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి. పాలలో బెల్లం వేసుకుని తాగటం కూడా చాలా మంచిది.
- బెల్లం చర్మానికి కూడా మేలు చేస్తుంది. ప్రతిరోజూ కొద్దిగా బెల్లం తీసుకోవడం వల్ల మొటిమలను దూరం చేసుకోవచ్చు. అలాగే, ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. బెల్లం చర్మాన్ని లోపల నుండి రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.
- బెల్లంలో పొటాషియం ఉంటుంది. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హృద్రోగులు చక్కెరకు బదులు బెల్లం వాడితే ప్రయోజనం ఉంటుంది.
- మీకు మలబద్ధకం ఉంటే రాత్రిపూట బెల్లం తీసుకోవడం ప్రారంభించండి. భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తింటే మలబద్ధకం సమస్య నయమవుతుంది.
Also Read : గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం..!