Home » షణ్ముఖ్ కేసులో సంచలనాలు వెలుగులోకి.. కన్న తండ్రే పట్టించాడా..?

షణ్ముఖ్ కేసులో సంచలనాలు వెలుగులోకి.. కన్న తండ్రే పట్టించాడా..?

by Anji
Ad

యూట్యూబ్ లో షార్ట్ ఫిలింస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ఇతనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ తరువాత బిగ్ బాస్ లో బుల్లితెర ఆడియన్స్ కి సుపరిచితుడై.. ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా షణ్ముఖ్, అతని తమ్ముడు సంపత్ గం**జాయి కేసులో పోలీసులకు చిక్కారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు. విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Advertisement

తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఓ విషయం బయటికి వచ్చింది. వీరిని వారి తండ్రే పట్టించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది కాలం క్రితం డాక్టర్ గా పని చేసే యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్ షార్ట్ ఫిలింస్ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా ఆ యువతిని తమ్ముడు సంపత్ కి కూడా పరిచయం చేశాడు. ఆ తరువాత సంపత్ కి ఆ యువతికి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. గత పదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వారి ఇంట్లో వారిని ఒప్పించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే ఇరు కుటుంబాల ఒప్పందంతో వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తరువాత ఆ యువతి తల్లికి హెల్త్ సమస్య రావడంతో వారి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.

Advertisement

 

ఇదే సమయంలో సంపత్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడట. ఈ విషయాన్ని స్వయంగా షణ్ముఖ్ తండ్రి అప్పారావు ఆ యువతికి తెలియజేశాడు. దీంతో ఆ యువతి సంపత్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సంపత్ ఫ్లాట్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సంపత్ పాటు.. షణ్ముఖ్ కూడా ఉన్నారు. పోలీసులు వారి ఫ్లాట్ ను తనిఖీ చేసే క్రమంలో అక్కడ గంజాయి లభించింది. దీంతో వెంటనే షణ్ముఖ్, సంపత్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం  ఈ కేసు విచారణ జరుగుతోంది. గతంలో కారు డ్రైవింగ్ కేసులో కూడా షణ్ముఖ్ వార్తల్లో నిలిచారు. పరోక్షంగా షణ్ముఖ్ తండ్రి కొడుకులను పట్టించాడనే అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

Visitors Are Also Reading