Home » విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టాడని.. పాకిస్తాన్ లో ఏం చేసారో తెలుసా ?

విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టాడని.. పాకిస్తాన్ లో ఏం చేసారో తెలుసా ?

by Anji
Ad

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ దంపతులు అభిమానులతో పంచుకున్నారు. తమ కుమారుడి అకాయ్ అని పేరు పెట్టినట్టు వెల్లడించారు.

Advertisement

విరాట్ కి కొడుకు పుట్టడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎత్తున వేడుకలను నిర్వహిస్తుంటారు. పాకిస్తాన్ లో సైతం అభిమానులు సంబురాలు చేసుకోవడం విశేషం. స్వీట్లు పంచుతూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. జూనియర్ కోహ్లీ తండ్రి బాటలోనే పయణించాలని.. అతడి రికార్డును బద్దలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మా కుమారుడు అకాయ్ ను ఫిబ్రవరి 15న ఈ లోకంలోకి స్వాగతించాం. మా జీవితంలోనే అత్యంత మధురమైన ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు, శుభాకాంక్షలను కోరుకుంటున్నాం.

Advertisement

మా వ్యక్తి గత గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నామని కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చాడు. కోహ్లీ తన కుమారుడికి అకాయ్ అని నామకరణం చేయడంతో ఈ పేరుకు ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. దీనికి నిపుణులు రెండు రకాల అర్థాలను చెబుతున్నారు. సంస్కృతంలో ఈ పదానికి అమరుడు, చిరంజీవుడు అని అర్థం వస్తుంది. హిందీలో కాయ్ అంటే శరరం అని.. అకాయ్ అంటే భౌతిక శరీరానికి మించిన వాడనే అర్థం వస్తుంది.

Also Read :  ఉప్పల్‌లో ఐపీఎల్‌.. సన్‌ రైజర్స్‌ షెడ్యూల్‌ ఇదే..!

Visitors Are Also Reading