మహిళలపై దాడి చేయాలంటే భయపడే విధంగా ఇవాళ కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును చూసి ఏదైనా నే*రం చేయాలంటేనే భయపడుతారని పలువురు పేర్కొంటున్నారు. వివరాలలోకి వెళ్లితే.. 2023లో కర్నూల్ జిల్లాకు చెందిన రుక్మిణి, శ్రవణ్ ఇద్దరికీ పెళ్లి జరిగింది. వీరి పెళ్లి జరిగిన సరిగ్గా 14 రోజులకే రుక్మిణి తల్లి రమాదేవి ని అల్లుడు శ్రావణ్, మామ వరప్రసాద్, అత్త రమా దేవి కలిసి దారుణంగా హ**త**మార్చారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన రుక్మిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.
Advertisement
Advertisement
విచారణలో భాగంగా రుక్మిణి తల్లి రమాదేవిని చంపింది భర్త శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించిన సాక్షాదారాలను కోర్టు ముందుకు ఉంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న కర్నూలు ఫ్యామిలీ కోర్టు అల్లుడు శ్రవణ్, మామ వరప్రసాద్ లకు ఉరిశిక్ష విధించింది. అలాగే హ**త్యకు సహకరించిన అత్త రమా దేవికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయంపై చర్చించుకోవడం గమనార్హం.
Also Read : త్రిష పై అసభ్యకర కామెంట్స్ చేసిన పొలిటీషియన్.. స్ట్రాంగ్ కౌంటర్..!