తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రజినీకాంత్ ఇప్పుడు అయితే యోగిగా మారిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే సన్యాసిగా జీవితాన్ని గడుపుతున్నారు. దైవ చింతన తప్ప మరో ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్నారు. సినిమాలు అలాగే ఆధ్యాత్మికత మాత్రమే ఆయన జీవితంలో ప్రస్తుతం ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎంత ఎత్తుకు ఎదగాలో అంతా చూసేశారు. చూడటానికి ఏమి లేదని కేవలం మిగిలి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా బ్రతకాలన్న ఒకే ఒక కారణంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
Advertisement
ఇదంతా కూడా ఆయన ఒక వయస్సు వచ్చిన తరువాత ప్రారంభించారు. కానీ కెరీర్ ప్రారంభంలో కాస్త స్టార్ డమ్ వచ్చిన తరువాత ఆయన వ్యసనాలకు బానిసయ్యారనే విషయం తెలిసిందే. విపరీతమైన మ**ద్యం సేవించి.. సిగరేట్లు కూడా అలవాటు ఉండేది. ఆ మత్తులో ఎప్పుడూ ఉండేవారు. తాగి ఒక్కోసారి షూటింగ్ కి కూడా వచ్చే వారు కాదు. ఎక్కడ పడితే అక్కడ తాగేస్తూ ఉండేవారట. కొన్ని సినిమాలు ఆయన పద్దతి తట్టుకోలేక మధ్యలోనే ఆపేశారట. కొంత మంది షూటింగ్ మొదలయ్యాక కూడా మరో హీరోతో మళ్లీ సినిమా మొత్తం రీ షూట్ చేసుకునేవారట. అలాంటి పరిస్థితుల్లోనే ఎన్టీఆర్ తో పాటు టైగర్ అనే ఓ సినిమాలో రజినీకాంత్ ని కూడా ఓకే చేసుకొని మల్టీస్టారర్ మూవీగా ప్రారంభించారు.
Advertisement
ఎన్టీఆర్ సినిమా తీస్తున్న అన్న భయం కానీ.. అలాంటి పెద్దవారిని ఇబ్బంది పెట్టొద్దు అని జ్ఞానం లేకపోయింది ఆ సమయంలో రజినీకాంత్ కి. యదావిధిగా తాగుతూ సరిగ్గా షూటింగ్ కి వచ్చేవారు కాదట. అతని పద్దతి నచ్చక నిర్మాత, దర్శకుడు రజినీకాంత్ ఈ సినిమా నుంచి తీసేద్దామని కూడా ఎన్టీఆర్ కి సలహా ఇచ్చారట. కానీ ఆ మాటతో కోపపడిన ఎన్టీఆర్ అతడికి తాగుడు అలవాటు ఉంటే ఎలాగొలా నచ్చ చెప్పి షూటింగ్ కి తీసుకురండి. కోపం ఉంటే అది ఎలా తగ్గించాలో అర్థం అయ్యేలా చెప్పండి. అంతేకానీ సినిమా నుంచి తీసేస్తే అతని భవిష్యత్ ఏమవుతుంది..? అని చెప్పారట. రజినీకాంత్ ఏదో ఒక రోజు పెద్ద స్టార్ అవుతాడు అంటూ ఎన్టీఆర్ ఆ సినిమాలో రజినీకాంత్ ఉండేలా చూసుకున్నాడట. ఈ విషయం తెలిసి రజినీకాంత్ చాలా సిగ్గుపడ్డాడట.