రవి ప్రకాష్ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు గాడ్ ఫాథర్ లాంటివాడు. TV9 అనే న్యూస్ ఛానల్ ను స్థాపించి వార్తలతో పాటు వాటి వెనకున్న మర్మాలను కూడా విప్పి చెప్పి సగటు ప్రేక్షకుడిని చైతన్యపరిచాడు. రాజకీయ నాయకుల అవినీతితో పాటు పేరుకపోయిన సమస్యలను ప్రస్తావిస్తూ అనతికాలంలోనే TV9 బ్రాండ్ ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాడు.
అలాంటి రవిప్రకాష్ అనూహ్యంగా TV9 నుండి బయటికి రావాల్సి వచ్చింది దానికి కారణం యాజమాన్యంతో గొడవలు దానికి అధికార పార్టీ అండదండలు. రవిప్రకాష్ TV9 నుండి బయటికొచ్చినప్పటి నుండి కొత్త ఛానల్ పెడుతున్నారంటూ వార్తలొచ్చినా రవి ప్రకాష్ మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు 7 కొత్త ఛానల్స్ తీసుకొస్తున్నారని, దీనికి సంబంధించిన బ్యాగ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యిందని సమాచారం!
Advertisement
7 భాషల్లో విన్నూత్నంగా :
మిడిల్ ఈస్ట్ సావరిన్ ఫండ్ తో పాటు సిలికాన్ వ్యాలీ మీడియా టెక్నాలజీ ఈక్విటీ గ్రూపులు ఈ ఛానల్స్ విషయంలో రవిప్రకాష్ కు సహాయాన్ని అందిస్తున్నాయట! దీనికి తోడు రవిప్రకాష్ ఎప్పుడు ఒకే అంటే అప్పుడు ఆయనతో జతకట్టే టీమ్ ఉండనే ఉంది. దీంతో ఎన్నికల కంటే ముందే ఈ ఛానల్స్ వచ్చే అవకాశముంది.
Advertisement
తెలుగులో మంచి స్కోప్ :
వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా రంగం అంత లాభసాటి వ్యాపారం కానప్పటికీ తెలుగు భాషలో మాత్రం మంచి మీడియా లేని లోటు కనిపిస్తుంది. ఉన్న ఛానల్స్ అన్నీ ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ నెట్టుకొస్తున్నాయి. వార్తలన్నీ యాంటీ గవర్నమెంట్, ప్రో గవర్నమెంట్ అన్నట్టు అయిపోయాయి. ఈ క్రమంలో తెలుగులో ఓ న్యూస్ ఛానల్ కి ఇప్పటికీ మంచి స్కోప్ ఉంది.
ఆ 7 భాషలు ఇవేనా?
తెలుగులో సక్సెస్ అయిన TV9 ను TV9 బంగ్లా, TV9కన్నడ, TV9తమిళ్ , TV9గుజరాత్ , TV9మరాఠి , TV9భరత్ వర్ష్ ,న్యూస్ 9 అంటూ వివిధ భాషల్లోకి తీసుకెళ్లారు. ఈ అన్నింట్లో రవిప్రకాష్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న పరిచయాలను ఉపయోగించుకుంటూ అవే భాషల్లో కొత్త ఛానల్స్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Also Read: సమంత నాగ చైతన్య విడాకుల గురించి నేను మాట్లాడలేదు….ఆ వార్తలు పుకార్లే : నాగార్జున