మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. మెగా మనవరాలును చూసుకునేందుకు మెగాస్టార్ సతీమణి సురేఖ గారు ఉన్నారు. సురేఖ గారు అంటే మెగా కుటుంబంలో అందరికీ ఎంతో ఇష్టం.. గౌరవం కూడా. అల్లు రామయ్య కుమార్తెగా, చిరంజీవి భార్యగా, రామ్ చరణ్ తల్లిగా, పవన్ కళ్యాణ్ వదినగా అందరికీ తెలిసిన సురేఖ జీవితంలో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సురేఖ 1958 ఫిబ్రవరి 18న అల్లు రామలింగయ్య, కనకరత్నమ్మ గారి దంపతులకు జన్మించారు. రామలింగయ్య హాస్యనటుడిగా, హోమియోపతి ఆయుర్వేద వైద్యుడు కూడా. ఆయన పేరు మీద రాజమండ్రిలో డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాల కూడా ఉంది. ఈయన 1050కి పైగా సినిమాల్లో అన్ని పాత్రల్లో నటించారు. ఆయన కుమారుడు అల్లు అరవింద్ అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు. రామలింగయ్య ఐదుగురు సంతానంలో చిన్నవారు సురేఖ. అందరి కంటే బాధ్యతగా ఉండేవారు. సురేఖ మొదటిసారి చిరంజీవి గారిని తాయారమ్మ బంగారయ్య 100 రోజుల ఫంక్షన్ అప్పుడు కలిశారు. ఆ సినిమాలో కైకాల సత్యనారాయణ, సావుకారి జానకి ప్రధాన పాత్రలో నటించారు. సినిమా హీరో అయి ఉండి కూడా ఇంత సింపుల్ గా ఉన్నారనిపించిందట. చిరంజీవి, సురేఖ కి పెళ్లి జరగడానికి ఇద్దరూ వ్యక్తులు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
అందులో ఒకరు చిరంజీవితో రెండో సినిమా మనవూరి పాండవులు నిర్మించిన జయకృష్ణ అయితే.. మరొకరు చిరంజీవితో నాలుగో సినిమా కుక్కకాటుకు చెప్పు దెబ్బ నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ రాజకీయ నాయకులు హరిరామజోగయ్య. వారిద్దరి చొరువతో రామలింగయ్య గారి కూతురు సురేఖతో చిరంజీవి వివాహం నిశ్చయం అయింది. అయితే వివాహం నిశ్చయం కావడానికి కొద్ది రోజుల ముందే ఒక సినిమా షూటింగ్ నిమిత్తం రైలులో బయలుదేరిన రామలింగయ్య గారితో పాటు రావుగోపాల్ రావు, ఇతర సీనియర్ నటీ, నటులు సరదాగా మాట్లాడుకుంటూ మద్యం సేవిస్తూ.. ఏం బాబు మన సంగతి ఏంటి అని అడిగారట. అప్పుడు చిరంజీవి గారు అయ్యో రామ రామ అంటూ లెంపలు వేసుకుంటూ.. నేను ఆంజనేయస్వామి భక్తుడిని.. అలాంటి అలవాట్లు ఏమి లేవు అని అమాయకంగా చెప్పారట.
Advertisement
అప్పుడే చిరంజీవి పై రామలింగయ్యకి సదభిప్రాయం ఏర్పడింది. ఆ తరువాత అల్లు అరవింద్ స్నేహితుడు నిర్మాత జయకృష్ణ చిరంజీవి గురించి అరవింద్ కి చెప్పాడట. మంచి స్థాయికి వెళ్తాడని.. కష్టపడే మనస్థత్వం ఉన్నవాడని చెప్పాడట. దీంతో చిరంజీవి-సురేఖ కి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ పెళ్లి చూపుల్లో చిరంజీవి గారు సురేఖతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం లభించింది. అప్పుడు చిరంజీవికి సురేఖ తెలిసినప్పటికీ కూడా మీ పేరు ఏంటి..? అని అడిగారట. దానికి సురేఖ సిగ్గుపడుతూ సురేఖ అని చెప్పారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి.. ఏం చదివారు అని అడిగారు చిరంజీవి. మా పేరెంట్స్ చెప్పలేదా అండి అని అడిగారట సురేఖ.. చెప్పారు లెండి.. ఏ గ్రూపు అని అడిగి కవర్ చేశారు చిరంజీవి. ఎం.ఏ.చేశానని చెప్పారు సురేఖ. కానీ సురేఖ గారు చిరంజీవిని ఒక్క ప్రశ్న కూడా అడగలేదట.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుండటంతో పాటు తన తల్లిదండ్రులు అన్ని విషయాలు కనుక్కొని ఆలోచించే తన గురించి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం సురేఖకి ఉందట. సురేఖ, చిరంజీవి నిశ్చితార్థం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ సమక్షంలో జరిగింది. ఆ తరువాత చిరంజీవితో సురేఖ వివాహం 1980 ఫిబ్రవరి 20న అంగరంగ వైభవంగా జరిగింది. వాస్తవానికి సురేఖ పుట్టిన ఫిబ్రవరి 18న ముహూర్తం అనుకున్నారు. కానీ తాతయ్య ప్రేమలీలలు సినిమా షూటింగ్ లో పాల్గొంటుండటంతో పెళ్లి చేసుకోవడానికి కూడా డేట్ దొరకని పరిస్థితి చిరంజీవిది. 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి నటించిన తొలి సినిమా పునాది రాళ్లు విడుదలైతే.. వివాహం జరిగే నాటికి 1980 ఫిబ్రవరి 20 నాటికి కేవలం ఒకటిన్నర సినిమాల్లోనే దాదాపు 20 సినిమాల్లో నటించారు చిరంజీవి. అప్పటికే మంచి స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. సురేఖతో వివాహం జరిగాకే సురేఖ స్టార్ అయ్యారని చెప్పవచ్చు. వివాహం జరిగాక అన్ని బాధ్యతలను తానే తీసుకొని కుటుంబాన్ని ముందుకు నడిపించింది సురేఖ.
Also Read : మనదేశం సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన ముగ్గురు లెజెండ్స్ ఎవరో చెప్పగలరా ?