విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ నందమూరి తారకరామరావు కి మొత్తం 12 మంది సంతానం. వీరిలో 8మంది కుమారులు, 4గురు కుమార్తెలు. అన్నగారికి ఉన్న వాత్సాతుల్యంతో పాటు అందమైన రూపం, నిండైన వ్యక్తిత్వం క్రమశిక్షణ, అందరినీ కలుపుకొని పోవడం లాంటి ఎన్నో లక్షణాలను పుచ్చుకున్న ఒకే ఒక్కరూ ఎవ్వరూ అంటే.. ఎవరైనా ఒప్పుకోవాల్సిన పేరు దగ్గుబాటి పురందేశ్వరి.
Advertisement
రాజకీయాల్లో రౌడీయిజం, పచ్చి బూ**తులు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కూడా రాజకీయాలు అంటే అందరికీ గౌరవాన్ని పెంచేవిధంగా ఉంటుంది పురంధేశ్వరి. అందుకే ఆమె ప్రతిభను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆమెను కేంద్ర మంత్రిని చేసింది కూడా. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఎన్ని పదవులు చేపట్టినా ఆమె గౌరవంగా భావించేది మాత్రం.. ఎన్టీఆర్ కుమార్తెగా మాత్రమే. 2023 జులై 04న బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించబడి వార్తల్లో నిలిచిన పురంధేశ్వరి జీవితంలో ఎవ్వరికీ తెలియని అత్యంత ఆసక్తికర విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు 1959 ఏప్రిల్ 22న చెన్నైలో జన్మించారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను చూసి చాలా పద్దతిగా పెరిగింది పురంధేశ్వరి. చదువులో కూడా ముందుండేవారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఆమె ఎక్కువగా బాలకృష్ణతోనే సన్నిహితంగా ఉండేవారు. పురంధేశ్వరీకి 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ని ఒక ప్రశ్న అడిగారు. ఎన్టీఆర్ దేవుడి పట్ల భక్తి, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. నాన్న గారు మనకు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారు కదా.. నేను ఏ దేవుడికి మొక్కాలి.. అంత మంది దేవుళ్లు ఎందుకు అని అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ నవ్వి.. చూడమ్మా.. నువ్వు ఒక గోడపై చిన్న నల్ల చుక్క పెట్టి దేవుడు అని నమ్మితే అదే నీకు దేవుడు.. మన ఆలోచనల్లో చెడును సరిచేసుకొని మంచిని పెంచుకోవడమే పూజా విధానం అని చెప్పాడట.
Advertisement
పురంధేశ్వరినీ తన తల్లి బసవతారకం చాలా బాగా చూసుకునేవారట. పురంధేశ్వరికీ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో వివాహం జరిగింది. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్ సభ ఎంపీగా, మరోసారి రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఆరోగ్య మంత్రిగా కూడా సేవలందించారు. అయితే పురంధేశ్వరినీ రెండు సార్లు రాజకీయాల్లో ఆసక్తి ఉందా..? అని అడిగారట ఎన్టీఆర్. నీ గురించి అందరూ చెబుతున్నారు. నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఎటువంటి పోటీ లేకుండా గెలుస్తావు అని ఎన్టీఆర్ అన్నాడట. అయితే.. దీనికి పురంధేశ్వరి గారు నాన్న మీరు ఎండనక, వాననక తొమ్మిది నెలలు రాష్ట్రమంతా తిరిగి ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు. నేను మాత్రం ఇంట్లో కూర్చొని ఎమ్మెల్యే అయిపోవాలా..? అని నవ్వుతూ అడిగారట పురంధేశ్వరి.
ముఖ్యంగా సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్లు అని పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఎంతో నిజాయితీగా ఉండేవారు. పేద వాళ్ల కోసం రూ.2కే కిలో బియ్యం, మద్యపాన నిషేదం, పక్కా గృహాల నిర్మాణం, జనతా వస్త్రాల్లాంటి ఎన్నో పథకాలు పెట్టి అధికారులు ఇవన్ని కష్టం అండి చేయలేము అని చెబితే.. ఎలా చేయాలో చెప్పండి.. చేయలేము అని మాత్రం చెప్పొద్దని ఆదేశించడమే కాకుండా 1994 ఆగస్టు సంక్షోభం తరువాత మళ్లీ తనకు జరిగిన అన్యాయం గురించి ప్రజలకు వివరించడానికి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ఈ సమయంలో పురంధేశ్వరి ఎందుకు నాన్న మీకు ఈ రాజకీయాలు మీకు ఆరోగ్యం సహకరించడం లేదు.. అయినా మీరు ఏం చూడలేదు.. మీరు చూడని డబ్బా.. పేరా..? అని ప్రశ్నించారు. అయితే ఆంధ్రరాష్ట్రంలో రామారావు ఎవడు అంటే..? నావాడు అని మాత్రమే అంటారు. మా వాడు అని కూడా అనరు. అంతకన్న ఏం కావాలి ఈ జీవితానికి.. నా ఆరోగ్య సమస్యలు, నా లక్ష్యం సాధించడానికి అడ్డంకి కాదు అని పురంధేశ్వరితో అన్నారు ఎన్టీఆర్. అనారోగ్యం కారణంతో ఎన్టీఆర్ 1996 జనవరి 18న తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఇక ఆ తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. 2004లో దగ్గుబాటి రామానాయుడు మీద పోటీ చేయాలని వై.ఎస్. సూచించడంతో తాను పోటీ చేయలేను అని చెప్పాడు. దీంతో అదే సమయంలో పురంధేశ్వరీ పోటీ చేస్తుందని వెంకటేశ్వరరావు ప్రకటించారు. అలా ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది పురందేశ్వరి.
Also Read : హీరోయిన్ సాయి పల్లవి అసలు పేరు ఏంటో తెలుసా ?