Ooruperu Bhairavakona Movie Review In Telugu : యంగ్ హీరో సందీప్ కిషన్ కి తెలుగులో మార్కెట్ మంచిగానే ఉంది. కుర్రాళ్లతో ప్రామిసింగ్ హీరో అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. సందీప్ కిషన్ ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయోగాల్లో భాగంగా వచ్చిందే ఊరిపేరు భైరవ కోన. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
నటీనటులు : సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వైవా హర్ష, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం : వీ.ఐ.ఆనంద్
నిర్మాత : అనీల్ సుంకర, రాజేష్ దండ
సినిమాటోగ్రఫీ : రాజ్ తోట
సంగీతం : శేఖర్ చంద్ర
కథ మరియు విశ్లేషణ :
బసవ (సందీప్ కిషన్) అతని స్నేహితుడు జాన్ (వైవా హర్ష) ఒక దొంగతనం చేసి.. అనుకోకుండా భైరవకోణ అనే గ్రామంలోకి వస్తారు. వీరితో పాటు గీత (కావ్య థాపర్) కూడా ఆ ఊర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ వీరి ముగ్గురికి విచిత్రమైన పరిస్థితులు ఎదురు అవుతాయి. భైరవకోనలో అన్నీ సంఘటనలు భయానకంగా ఉంటాయి. బసవ దొంగిలించిన బంగారాన్ని రాజప్ప దక్కించుకుంటాడు. ఆ భైరవకోనకి మిగతా ఊర్లకు తేడా ఏమిటి..? గరుణ పురణంలో మిస్ అయిన నాలుగు పేజీల్లో భైరవకోన గురించి ఏం చెప్పారు. తాను ప్రేమించిన భూమి(వర్ష బొల్లమ్మ) కోసం బసవ దొంగగా ఎందుకు మారాడు..? అతనికి భైరవకోనలో ఎదురైన ట్విస్ట్ ఏంటి.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఊరు పేరు భైరవకోన సినిమాను వీక్షించాల్సిందే.
Advertisement
భైరవ కోన పరిచయ సన్నివేశాలతో దర్శకుడు చాలా సులువుగా కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాడు. కథ ఎప్పుడైతో భైరవకోనలోకి ప్రవేశిస్తుందో అక్కడి నుంచి సినిమాటిక్ లిబరిటీ చాలా ఎక్కువ అయిపోతుంది. ఫస్టాప్ లో బసవ, భూమి ట్రాక్ విడిగా నడుస్తూ ఉండటం, భైరవ కోన అసలు ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రివిల్ చేయకపోవడంతో ఓ మంచి ఫాంటసీ అడ్వెంచర్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ రివిల్ అవుతుందో అక్కడ నుంచి భైరవకోన కథ సామాన్య ప్రేక్షకులు ఓన్ చేసుకోలేనంత దూరం వెళ్లిపోతుంది. భైరవకోన సెంకడాప్ కాస్త ఇంట్రెస్టింగ్ ఉన్నప్పటికీ ప్రేక్షకులకు పెద్ద ఎంగేజ్ అయ్యే పరిస్థితి కనిపించదు. మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ ఓ విషాదాంతంతో ముగుస్తుంది. బలహీనమైన క్లైమాక్స్ భైరవకోనకి పెద్ద మైనస్ గా మారింది. ఈ సినిమా కోసం హీరో సందీప్ కిషన్, భూమి పాత్రలో వర్ష బొల్లమ్మ నటన అదుర్స్. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఆకట్టుకుంది. డైరెక్టర్ వీ.ఐ ఆనంద్ తెరకెక్కించే విధానంం కాస్త మైనస్ అనే చెప్పాలి. కెమెరా వర్క్ ఓకే, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగానే ఉన్నాయి.
పాజిటివ్ పాయింట్స్ :
- ఫస్టాప్
- వెన్నెల కిషోర్
- వైవా వర్ష
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సందీప్ కిషన్, కావ్యథాపర్, వర్షబొల్లమ్మ
మైనస్ పాయింట్స్ :
- సెకండాఫ్
- ఎమోషనల్ మిస్ అవ్వడం
- క్లైమాక్స్
- డైరెక్టర్
రేటింగ్ : 3/5