ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. అధికార వైఎస్సార్ సీపీకి చుక్కలు కనిపించేలా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ఆకట్టుకున్నారు. మరోవైపు యువగళం పాదయాత్రతో నారా లోకేష్ వైసీపీ పార్టీని ఢీకొట్టేలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేదానిపై టెన్షన్ నెలకొంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ దేవర ‘ సినిమాతో బిజీగా ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూనియర్ ఎన్టీఆర్ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు.
Advertisement
తన స్పీచ్ తో అందరిని ఉర్రూతలూగించారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఎప్పుడు ప్రచారం చేయలేదు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న ఆయన సిద్ధాంతాలు అంటే జూనియర్ ఎన్టీఆర్ కు చాలా ఇష్టం. ‘ అరవింద సమేత ‘ సినిమా ముహూర్తం అప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Advertisement
అలా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా జూనియర్ ఎన్టీఆర్ రానున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నే స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కలిసి వస్తున్నాయి కాబట్టి మీకు సపోర్టుగా నేను వస్తాను అని జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి చెప్పారట. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : పదేళ్ల తరువాత బొత్స కి చిరంజీవి ప్రస్తావన ఎందుకు ? కారణం అదేనా ?