దర్శకుడు మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన కంత్రి, శక్తి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. వాస్తవానికి శక్తి సినిమాకి సంబంధించి తొలుత అనుకున్న కథ అది కాదట. తెరవెనుక దాగి ఉన్న కథని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన మూవీ శక్తి. ఈ చిత్రాన్ని నిర్మించిన అశ్వనిదత్ భారీగానే నష్టపోయారు. ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం చెప్పాడు దర్శకుడు మెహర్ రమేష్. తాజాగా ఆ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో తాను తొలుత అనుకున్న కథ వేరే అని చెప్పాడు. తాను మిషన్ ఇంపాజిబుల్ తరహాలో ఓ కథను అనుకున్నానని.. మొదటి కథలో ఒక గైడ్ ఉంటాడు. అతను హోంమినిస్టర్ కూతురును కాపాడుతాడు. తీరా చూస్తే అతను గైడ్ కాదు.. ఎన్ఎస్ జీ కమాండో అని తెలుస్తుంది. ఆ సమయంలోనే హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఉంటుందని తెలిపారు. కానీ నిర్మాత అశ్వనీదత్ ఈ కథను మార్చేశారని తెలిపారు. ఆ సినిమా సమయంలో ఎన్టీఆర్ బృందావనం చేస్తున్నాడు. దీంతో తమ శక్తి మూవీకి గ్యాప్ వచ్చిందట.
Advertisement
ఆ సమయంలోనే నిర్మాత మార్పులు చెప్పారట. సెకండాఫ్ లో సోషియో ఫాంటసీ ఎలిమెంట్లని యాడ్ చేద్దామనుకున్నాడని.. ఆయన మాట కాదనలేక వాటిని యాడ్ చేసినట్టు తెలిపారు. అందుకోసం యండమూరి వీరేంద్రనాథ్ వంటి ఇద్దరూ ముగ్గురు పండిత రైటర్లను అందించాడట. ఆ తరువాత ఎలిమెంట్స్ తనకు అర్థం కాలేదని తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాత దత్ కి చెప్పాడట. ముందు అనుకున్న కథను అలాగే ఉంచి.. వేరే కథతో సినిమా చేద్దామని అడిగాడట. లేదు ఈ ఎలివెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయని వాళ్లు చెప్పడంతో తీయాల్సి వచ్చిందని తెలిపారు. విజువల్ గా ఆ మూవీ ది బెస్ట్ అని.. బడ్జెట్ వైజ్ గా ఈ సినిమా నిర్మాతకి బాగా వర్కౌట్ అయిన మూవీగా దర్శకుడు మెహర్ రమేష్ చెప్పడం గమనార్హం. మరోవైపు ఈ సినిమా నిర్మాతకి దాదాపు 30కోట్ల వరకు నష్టాలను తెచ్చిందనే ప్రచారం జరుగుతుంది. మెహర్ రమేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : నాగేశ్వర రావును మెచ్చుకుని, ఎన్టీఆర్ ని ద్వేషించిన ఆ హీరో ఎవరో తెలుసా..?