Home » నాగచైతన్య ని వద్దని అఖిల్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్న నాగార్జున.. కారణం అదేనా..?

నాగచైతన్య ని వద్దని అఖిల్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్న నాగార్జున.. కారణం అదేనా..?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైనటువంటి నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కినేని నాగేశ్వర్ రావు కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ తరుణంలోనే ఆయన చేసిన సిసింద్రీ మూవీలో ఆయన కొడుకు అఖిల్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.

sisndri

Advertisement

 

అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే నాగచైతన్య కూడా హలో బ్రదర్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూశాడట. కానీ పరిచయం చేయలేకపోయాడు. అఖిల్ ని సిసింద్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయడం వెనుక కొడుకుల విషయంలో నాగార్జున చాలా తేడాని చూపిస్తున్నాడంటూ.. అప్పట్లో చాలా మంది విమర్శించారు కూడా. ఇదిలా ఉంటే.. అక్కినేని మూడోతరం నటవారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ వారి సినిమాల విషయంలో వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నారు. నాగార్జున సినిమాలు మంచి విజయాలను సాధిస్తుంటే.. నాగచైతన్య, అఖిల్ చేసిన సినిమాలు మాత్రం పెద్దగా సక్సెస్ సాధించడం లేదు.

Advertisement

ఇప్పటికైనా వీళ్లు చేసే సినిమాలు ఇండస్ట్రీలో గుర్తింపు సాధించుకొని వీళ్లని కెరీర్ సూపర్ స్టార్లుగా మారుస్తాయా.? లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే నాగచైతన్య చైల్డ్ ఆర్టిస్ట్ గా చేయకపోవడం వెనుక ఆయనకి కొంత మేరకు అన్యాయం చేశారనే చెప్పవచ్చు. అఖిల్ సిసింద్రీ మూవీతో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో.. ఇప్పుడు అలాంటి సక్సెస్ ఒక్కటి కొడితే.. ఇండస్ట్రీలో ఇక తిరుగుండదనే చెప్పాలి.

Also Read : అల్లు అర్జున్ భార్యలో ఈటాలెంట్ కూడా ఉందా..? స్నేహారెడ్డి కూడా ఇండస్ట్రీకి వస్తారా..?

Visitors Are Also Reading