మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు అనేక చాలా దుష్ప్రభావాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీక్షాభావ్‌సర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ముఖ్యంగా ఎసిడిటి, అజీర్ణం వంటి సమస్యను నివారించడానికి చిట్కాలను చెప్పారు. వాస్తవానికి ఒక వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకుంటే వ్యాధి రాకుండా నివారణ ఉత్తమం. కానీ ఇటీవల కాలంలో ఎసిడిటి, అజీర్ణం సమస్యలను ఎదుర్కొనే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వీటిని నిరోధించడానికి డాక్టర్ భావ్‌సర్ సిఫారసు చేసిన ఆయుర్వేద నివారణలు ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ముఖ్యంగా భోజనంలో ఎక్కువ కారం, పులుపు, పులియబెట్టిన, వేయించిన ఫాస్ట్‌పుడ్‌ను తీసుకోవడం తగ్గించండి. తాజా పండ్లు, కూరగాయలతో నిండిన ఆరోగ్యకరమైన పోషకమైన ఆహారాన్ని తీసుకొండి. భోజనం అతిగా తినకూడదు. కొంచెం కొంచెం మూడు నుంచి నాలుగు సార్లు తినండి. పుల్లని పండ్లకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎసిడిటి ఉన్న వారు ఎక్కువ సేపు ఆకలితో ఉండకండి. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం దాటవేయవద్దు. సమయానికి తినడం అలవాటు చేసుకోండి.
Advertisement
ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు తదితర వాటిని తరుచుగా మానుకోండి. ఇక మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. ఆహారం తీసుకునన వెంటనే పడుకోవడం, పడుకోబెట్టడం మానుకోండి. టీ, కాఫీలతో పాటు అస్పిరిన్ వంటి మందులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఒత్తిడికి దూరంగా ఉండటం ఎంతో మేలు.
కొత్తిమీర వాటర్ తాగండి. భోజనం తరువాత అర టీ స్పూన్ మెంతులు గింజలను నమలండి. ఉదయం లేవగానే ముందుగా కొబ్బరి నీళ్లు తాగండి. మధ్యాహ్నం మెంతుల రసం త్రాగాలి. తీపి కోసం మిస్రిని జోడించవచ్చు. ఎండు ద్రాక్షను రాత్రి అంతా నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగాలి. నిద్రలో ఒక టీ స్పూన్ ఆవు నెయ్యితో గోరవెచ్చని పాలు తాగండి. రోజ్ వాటర్, పుదీనా నీరు త్రాగడం వల్ల శరీరం చల్లబడడమే కాకుండా జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. దానిమ్మ, అరటిపండ్లు, రేగు పండ్లు, ఎండు ద్రాక్ష, నేరేడుపండ్లు వంటివి సీజన్‌కు అనుగుణంగా తినండి.