Home » గేల్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడు..!

గేల్, సెహ్వాగ్ రికార్డులు బ్రేక్.. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడు..!

by Anji
Ad

గతంలో ఏ క్రికెటరైనా.. సెంచరీ సాధించాడంటే.. అదొక గొప్ప ఘనత భావించేవాళ్లు ఫ్యాన్స్. అయితే ఇప్పుడు సెంచరీల టైం అయిపోయింది. ఇప్పుడు అందరి లక్ష్యం డబుల్ సెంచరీ. అవునండీ..! వన్డే చరిత్రలో మరో డబుల్ సెంచరీ నమోదైంది. ఈసారి శ్రీలంక బ్యాటర్ ఈ ఘనత సాధించాడు. పల్లెకెల్లె వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో శ్రీలంక రెచ్చిపోయి.. మరీ ఆడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లంకేయులు.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేశారు. ఆ జట్టు ఓపెనర్ డబుల్ సెంచరీ నమోదు చేసి రికార్డుల్లోకి ఎక్కాడు.

Advertisement

ఓపెనర్ పాతుం నిస్సాంక.. 139 బంతులు ఎదుర్కుని ఏకంగా 210 పరుగుల భారీ స్కోర్ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 20 ఫోర్లు, 8 సిక్సర్లు బాదేశాడు. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 88 పరుగులతో రాణించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నిస్సాంకకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కాగా.. అతడు తన వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం 4 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. ఈ 25 ఏళ్ల రైట్ హ్యాండ్ బ్యాటర్.. 24 ఏళ్ళ రికార్డును తిరగరాశాడు. సరిగ్గా 2000 సంవత్సరంలో భారత్‌పై సనత్ జైసూర్య 189 పరుగులు కొట్టి.. వన్డేలలో శ్రీలంకన్ బ్యాటర్ అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును తన పేరిట రాసుకున్నాడు నిస్సాంక. అలాగే గేల్(138), సెహ్వాగ్(140) బంతుల్లో డబుల్ సెంచరీ సాధించగా.. నిస్సాంక కేవలం 136 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించి.. వారి రికార్డును బద్దలు కొట్టాడు. ఈ డబుల్ సెంచరీతో వన్డేలలో మొట్టమొదటి శ్రీలంకన్ బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు నిస్సాంక.

Advertisement

Visitors Are Also Reading