Home » బాలకృష్ణ ప్రారంభించాక మధ్యలో నిలిచి పోయిన సినిమాలు ఇవే..!

బాలకృష్ణ ప్రారంభించాక మధ్యలో నిలిచి పోయిన సినిమాలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రధానంగా బాలయ్య సినిమా వస్తుందంటే.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. బాలకృష్ణ సినిమా హిట్, ఫట్ తో సంబంధం లేకుండా నిర్మాతలకు మాత్రం మంచి లాభాలను మిగులుస్తాయి. బాలయ్య మీద ఎన్నో ఆశలు పెట్టుకొని సినిమా ప్రారంభించిన, ప్రారంభించాలనుకున్న కొందరూ నిర్మాతలకు నిరాశ ఎదురైంది. ఎందుకు అంటే.. ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. వాస్తవానికి ఆ సినిమాలు విడుదలై ఉంటే బాలయ్య రేంజ్ వేరే లెవెల్ ఉండేదేమో మరీ. ఆ సినిమాలు ఏవి.. ఎందుకు ఆగిపోయాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Advertisement

నిర్మాత జి.సుబ్బారావు జంధ్యాల 1986లో నటరత్న టైటిల్ తో ఓ సినిమా చేద్దామనుకున్నాడు. నటరత్న మూవీ షూటింగ్ అమెరికాలో పూర్తి చేద్దామని జంధ్యాల కోరుకున్నాడు. కానీ వీసాలు రావడం కాస్త ఆలస్యమైంది. దీంతో బాలయ్య వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. అందుకే ఆ సినిమా చేయలేకపోయాడు. చివరికీ ఆ సినిమాలో ఘట్టమనేని రమేష్ బాబు హీరోగా చేశాడు. దీనికి నటరత్న అని కాకుండా చిన్ని కృష్ణుడుగా టైటిల్ పెట్టారు. గోపాలరెడ్డి, సుధాకర్ రెడ్డి కలిసి బాలయ్యను హీరోగా పెట్టి శపథమ్ మూవీ సినిమాని 3డీలో రూపొందించాలని ప్లాన్ చేశారు. కథ కూడా రాసుకున్నారు. క్రాంతి కుమార్ దర్శకత్వ బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ఆగిపోయింది. 

వీటిని చదవండి: ‘రామాయణం’లో శూర్పణఖగా రకుల్.. సోషల్ మీడియాలో వైరల్

Advertisement

 

మరోవైపు నిర్మాత కోగంటి హరికృష్ణ-బాలకృష్ణతో బాలకృష్ణుడు మూవీ చేస్తున్నట్టు ఒకానొక సమయంలో ప్రకటించారు. ఎస్.ఎస్.రవిచంద్రను దీనికి దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. కథ కూడా పూర్తిగా ఫినిష్ చేశారు. రవిచంద్ర, కోగంటి హరికృష్ణ దర్శక, నిర్మాతలుగా బాలకృష్ణ హీరోగా అశోక చక్రవర్తి సినిమా రూపొందింది. అశోక చక్రవర్తి, ధ్రువనక్షత్రం సినిమాలు ఒకే కథతో వచ్చాయి. రెండు ఒకేరోజు విడుదలయ్యాయి. ఈ విషయం తెలిసిన బాలయ్య బాగా కోపం తెచ్చుకున్నాడు. రెండు కథలు ఒకటయ్యాయని ఫీల్ అయ్యాడు. అందుకే బాలకృష్ణుడు సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. 2002లో హీరో బాలకృష్ణ-దర్శకుడు వి.సముద్ర కాంబినేషన్ లో ఓ చిత్రాన్ని నిర్మించడం ప్రారంభించారు బెల్లంకొండ సురేష్. దేశభక్తి, లవ్, సెంటిమెంట్, యాక్షన్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి.

balakrishna-movies

బాలయ్యను కమాండో పాత్రలో చూపించాలనుకున్నారు పరుచూరి బ్రదర్స్. ఈ సినిమా కోసం తూటాల్లాంటి మాటలు రాశారు. కానీ ఎందుకో కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తరువాత ఆగిపోయింది. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ గోపాల రెడ్డి, బాలకృష్ణ కాంబోలో కోడిరామకృష్ణ దర్శకత్వంలో ప్లాన్ ఓ చేసిన జానపద చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. దీనికి విక్రమసింహ భూపతి టైటిల్ అనుకున్నారు. మహారాజుగా,  యోధుడుగా, బాలకృష్ణ డబుల్ రోల్ చేశాడు. ఈ సినిమా సగానికి పైగా పూర్తి అయ్యాక బాలయ్య, గోపాలరెడ్డి మధ్య అభిప్రాయ బేదాలు ఏర్పడి మూవీ అర్థాంతరంగా నిలిచిపోయింది. దీంతో నిర్మాత గోపాల రెడ్డి చాలా నష్టపోయాడట. ఇలా బాలయ్య చాలా సినిమాలు ఆగిపోయాయి. 

వీటిని చదవండి: ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ఐరా ఖాన్.. ఏమైందంటూ నెటిజన్స్ కామెంట్స్..!

Visitors Are Also Reading