సాధారణంగా క్రికెటర్ల కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలుంటాయి. ఎలాంటి దిగ్గజ ఆటగాడికి అయినా ఒకానొక దశలో విమర్శలు తప్పవు. యువ క్రికెటర్లు అయితే.. కొన్ని మ్యాచ్ లు సరిగ్గా ఆడకపోతే ఇతడినీ ఎందుకు ఆడిస్తున్నారు. టీమ్ లో నుంచి తీసేయండి అంటూ విమర్శల గురించి మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి విమర్శలనే టీమిండియా బ్యాటర్ శుభ్ మన్ గిల్ ఎదుర్కున్నాడు. గత కొంతకాలంగా పూర్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న గిల్.. ఒకే ఒక్క సెంచరీతో అందరికీ సమాధానమిచ్చాడు.
Advertisement
వాస్తవానికి గిల్ కి మేనేజ్ మెంట్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చిందట. అందుకే కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాడు. గిల్ గత 10 ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్ ని పరిశీలించినట్టయితే.. షాక్ అవ్వాల్సిందే. 10 ఇన్నింగ్స్ ల్లో గిల్ అత్యధిక స్కోర్ 36 అంటేనే . అతడు ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు ఇతర దేశాల దిగ్గజ ఆటగాళ్లు కూడా గిల్ కి వార్నింగ్ ఇచ్చారట. నువ్వు ఇలాగే పూర్ ఫామ్ ను కొనసాగిస్తే, నీ నం.3 పొజిషన్ కు గండం ఉన్నట్లే అని మేనేజ్ మెంట్ గిల్ కు తేల్చి చెప్పినట్లు సమాచారం.
Advertisement
వైజాగ్ తో జరిగే టెస్ట్ నీకు ఆఖరి ఛాన్స్ అని సెలెక్టర్ల బృందం గిల్ కు కౌంటర్ ఇచ్చింది. దీంతో గిల్ పై తీవ్ర ఒత్తిడి పడింది. అయినప్పటికీ.. ఆ ఒత్తిడిని జయించి, కీలక సమయంలో టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని అందిచాడు. మరోవైపు గిల్ స్థానానికి ఎసరుపెట్టడానికి సీనియర్ ప్లేయర్ పుజారా రెడీగా ఉన్నాడు. రంజీల్లో అతడు సత్తాచాటుతున్నాడు. ఇన్ని సమస్యల నేపథ్యంలో గిల్ ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాడు.
మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ వీక్షించండి !