టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. గత కొంత కాలం వరకు కూడా ఆమెకు టాలీవుడ్ లో పోటీ లేదు. ఇక ఆ తరువాత మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. ఉన్నంత కాలంలోనే టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆమెకు అవకాశాలు కాస్త తగ్గినప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు.
Advertisement
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ తన గ్లామరస్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ గ్లామర్ గా కనిపించేందుకు కష్టపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అంటూ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చింది. రకుల్ పెళ్లి చేసుకునేది ఎవరినో కాదండోయ్.. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారని ఇదివరకే తెలిపింది రకుల్. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా తమ రిలేషన్ గురించి ప్రకటించారు.
Advertisement
ఫిబ్రవరి నెలలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్నారు. మరి కొద్ది రోజుల్లోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది రకుల్. ఈ నేపథ్యంలోనే రకుల్ థాయ్ లాండ్ లో బ్యాచ్ లర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో రకుల్ కి కాబోయే భర్త జాకీ భగ్నానీతో పాటు మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. టాలీవుడ్ నుంచి ఈ పార్టీకి మంచు లక్ష్మీ, ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు. రకుల్ మంచు లక్ష్మీ మంచి స్నేహితులు అనే టాలీవుడ్ మొత్తానికి తెలిసిందే. దీంతో బ్యాచ్ లర్ పార్టీకి హాజరై ఎంజాయ్ చేశారు మంచు లక్ష్మీ.
మరికొన్ని సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు వార్తలను ఇక్కడ వీక్షించండి !