Home » వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్ లో 5జీ సేవలు..!

వొడాఫోన్-ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్ లో 5జీ సేవలు..!

by Anji
Published: Last Updated on
Ad

Vodafone-Idea  5G సేవను ప్రారంభించడంలో చాలా ఆలస్యం అయిందనే చెప్పాలి.  ఎందుకంటే భారతదేశంలో వీఐ ప్రత్యర్థులై కూడా ఇంకా 5జీ సేవలను ఎందుకు ప్రారంభించడం లేదని వినియోగదారులు చర్చించుకుంటున్నారు. ఇక జియో, ఎయిర్ టెల్, ఈ రెండు కంపెనీలు గత కొద్ది నెలలుగా దేశంలో 5G సేవలను అందిస్తున్నాయి. Jio, Airtel గత కొద్ది నెలలుగా వినియోగదారులకు వారి ప్రత్యేక ప్లాన్‌లతో అపరిమిత 5G సేవను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇటీవల ఈ కంపెనీలు తమ ఉచిత 5G సేవ, కొత్త 5G ప్లాన్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

Advertisement

Advertisement

అటువంటి పరిస్థితిలో, Vodafone-Idea కంపెనీ ఈ రేసులో చాలా ఆలస్యంగా వచ్చింది. కానీ ఇప్పటికీ 5G సేవ వారికి లైఫ్‌సేవర్‌గా పని చేస్తుంది. ఎందుకంటే 4G సర్వీస్ విషయంలో, Jio, Airtel కంటే Vodafone Idea చాలా వెనకబడి ఉంది. వినియోగదారులు Vi నెట్‌వర్క్ , సేవలను కూడా పెద్దగా ఇష్టపడటం లేదు.  ఇప్పుడు Vi 5G సేవను ప్రారంభించబోతోంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, Vi చీఫ్ ఎగ్జిక్యూటివ్ అక్షయ్ ముంద్రా ఈ ప్రకటన చేశారు. దాదాపు 6 నుండి 7 నెలల్లో 5G సేవలను ప్రారంభించాలని మేము ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు.   భారతదేశంలో 5G సేవలను విడుదల చేసి.. 3G  సేవలను నిలిపివేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.  ముఖ్యంగా  2025 ఆర్థిక సంవత్సరం నాటికి దేశం నుంచి తన 3G సేవలను పూర్తిగా మూసివేయాలని కంపెనీ యోచిస్తోంది అని తెలిపారు.

Visitors Are Also Reading