2024 సంక్రాంతి కానుకగా నాలుగు సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే అందులో వివేష ప్రేక్షకాదారణ పొందిన సినిమా హనుమాన్. ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నెంబర్ వన్ గా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.
Advertisement
ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమతో హనుమాన్ మూవీ రికార్డు సృష్టించింది. 92 ఏళ్ల టాలీవుడ్ ప్రస్థానంలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని పేర్కొంది. జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటివరకు రూ.278 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ రానుంది. కొద్ది రోజుల కిందటే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి. ఈ మూవీలోని ప్రధాన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు. ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో వారి ఇమేజ్ సరిపోవాలి. చూడగానే భక్తితో నమస్కారం చేయాలనే భావన కలగాలి. ఆ జాబితాలో చిరంజీవి సర్ కూడా ఉండవచ్చు అని ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Advertisement
రాముడిగా తన మనసులో ఉన్న నటుడు మహేష్ బాబు అని.. సోషల్ మీడియాలో రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశానని, తమ ఆఫీస్ లో కూడా రాముడి పాత్రను మహేష్ ముఖంతో రీక్రియేట్ చేసి చూశామన్నారు. పార్ట్ 1లో నటించిన తేజ సజ్జా కూడా పార్ట్ 2లో కనిపిస్తారు. హనుమాన్ మూవీలోని హనుమంతుడి ఎంట్రీ సీన్ గురించి డైరెక్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి ఆ సన్నివేశాన్ని అయోధ్య బ్యాక్ డ్రాప్ లో తీయాలని అనుకున్నారట. ఒక పాప రామమందిరంలో దీపాలు వెలిగించాలని చూస్తుంటుంది. కానీ గాలి కారణంగా అవి వెలగవు. అదే సమయానికి మందిరం పై నుంచి హనుమాన్ వెళ్లగానే.. ఆ దీపాలు వాటికవే వెలుగుతాయి. ఇలా రాసుకున్న సీన్ కొన్ని కారణాల వ్లల మార్చాల్సి వచ్చిందని చెప్పారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!