సీఎం జగన్ పై విమర్శలు చేశారు టీడీపీ నేత నారా లోకేష్. జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. జగన్ పాలనలో అధికారుల ప్రాణాలకు రక్షణ లేదని తేలిపోయిందని అన్నారు. వైసీపీ నేతల వేధింపులతో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం అని పేర్కొన్నారు. వైసీపీ అరాచక పాలనకు వందల మంది ఉద్యోగులు బలయ్యారని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతల అవినీతికి ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు బలికావాలి అని ప్రశ్నించారు.
Advertisement
కేష్ ట్విట్టర్(X) లో… “ఉద్యోగులారా ఆ**త్మ*హ**త్యలొద్దు.. ఆత్మ స్దైర్యంతో ఉండండి. విశాఖ జిల్లాలో వైసీపీ భూ అక్రమాలకు సహకరించలేదని వైసీపీ నేతలే తహసీల్దార్ సనపల రమణయ్యని అత్యంత దారుణంగా చంపేయడం జగన్ పాలనలో ప్రభుత్వ అధికారుల ప్రాణాలకు రక్షణలేదని తేలిపోయింది. బాపట్ల జిల్లా చావలి గ్రామ ఆర్బీకేలో వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న బి పూజిత ఆత్మహత్యకు కారణం వైసీపీ నేతలు ఎరువులు ఎత్తికెళ్లిపోవడమే. బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతిని బలిగొన్నది వైసీపీ నాయకులే.
Advertisement
విజయనగరం జిల్లా రాజాంలో పంచాయతీరాజ్ శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ పనిచేస్తున్న జేఈ వల్లూరు రామకృష్ణని మాయచేసి వైసీపీ నేతలు సిమెంటు ఎత్తుకెళ్లారు. ఉన్నతాధికారులు సిమెంటు లెక్క చెప్పమంటూ ఒత్తిళ్లు, వైసీపీ నేతలు దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించడంతో రామకృష్ణ పంచాయతీరాజ్ కార్యాలయంలోనే ఉరివేసుకుని తనువు చాలించారు. ఇది వైసీపీ నేతలు చేసిన హ**త్య కాదా? తప్పులు చేసిన వైసీపీ నేతలు కాలరెగరేసుకుని తిరుగుతుంటే.. ఏ తప్పూ చేయని మీరెందుకు ఆ**త్మ*హ**త్యకు పాల్పడాలి? త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను వేధించిన వైసీపీ నాయకుల్ని కఠినంగా శిక్షిస్తాం అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!