సాధారణంగా టాలీవుడ్ లోనే కాదు.. మనదేశంలో దర్శకులు, రచయితలు మరొకరి ఐడియాలను లింక్ చేయడంలో ఆరితేరిన ముఠా అనే చెప్పవచ్చు. ఎంత పెద్ద దర్శకుడినీ తీసుకున్నా.. సొంత టాలెంట్ 25 శాతం ఉంటే.. మిగతాది 75 శాతం కాపీ కొడతారు. ఇంకొంత మంది రచయితలు అసిస్టెంట్ల ఐడియాలను కాపీ కొడతారు. ఇలాగే ఇప్పుడు శ్రీమంతుడు కథ దర్శకుడు కొరటాల శివకు చుట్టుకుంది. నవ్విపోతురు గాక నాకేంటీ సిగ్గు అనేది.. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి అయింది. అసలు ఏం జరిగిందంటే..? ఆ పెన్ను పేరు శరత్ చంద్ర.. రచయిత పేరు ఆర్డీ విల్సన్. ఓ రోజు ఆర్డీ విల్సన్ కి ఫోన్ కి ఉందచ్చింది.
Advertisement
శ్రీమంతుడు సినిమా చూశావా అన్నాడు శరత్ చంద్ర ఫ్రెండ్. అయితే అర్జెంట్ గా చూడు.. సేమ్ టూ సేమ్ నీ నవల లాగే ఉందని చెప్పాడు. వెంటనే సినిమాని చూశాడు. శ్రీమంతుడు సినిమా చూశాక తన నవల కథనే ఈ సినిమాగా తీశారని.. మొదట దర్శకుడు కొరటాలని సంప్రదించాడు రచయిత శరత్ చంద్ర. 2012లో స్వాతి పత్రికలో నవల రాశాను.. మా కథనే మీరు సినిమా తీశారని చెప్పాడు. కాదు.. మీ కథకు మా సినిమాకి సంబంధం లేదని ఒక్క మాటలో చెప్పేశాడు. చివరికీ రచయితల సంఘంలో పని చేశాడు శరత్ చంద్ర అలియాస్ విల్సన్. హైదరాబాద్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేశారు. వారెవ్వరు న్యాయం చేయలేదు. దాసరి చూసి రెండు ఒకేవిధంగా ఉన్నాయని చెప్పాడు. టాలీవుడ్ రచయితల సంఘం ఓ కమిటీ వేసింది. దాదాపు 20 అంశాలను కాపీ కొట్టారని పోలికలను పంపించారు.
Advertisement
చివరకు రచయితల సంఘం కూడా కొరటాల శివ తీసిన శ్రీమంతుడు సినిమాని కాపీ కొట్టారని తీర్మాణించింది. దీంతో కొరటాల దొగొచ్చి తన వారి ద్వారా పదో.. ఐదో లక్షలు ఇస్తామని చెప్పారు. చేసిందే తప్పు.. ఆయన ఏమైనా బిచ్చగాడా..? మీరు ఎంతో కొంతో ఇస్తే తీసుకోవడానికి అన్నారు. హిందీ హక్కులను అమ్ముకున్నారు. స్టోరీ కింద నా పేరు వేయాలన్నారు శరత్ చంద్ర. కానీ కొరటాల స్పందించలేదు. దీంతో నాంపల్లి కోర్టుకు వెళ్లారు రచయిత శరత్ చంద్ర. రచయితలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కొరటాల పై చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కొరటాల శివ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పు సరైందేనని తేల్చేసింది హై కోర్టు. ఇక కొరటాల అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారు. రచయితల సంఘం నివేదిక ప్రకారమే రెండు కోర్టులు నిర్ణయం తీసుకున్నాయి.
సుప్రీంకోర్టు కూడా పిటిషన్ వెనక్కి తీసుకుంటారా..? మేమే డిస్మిస్ చేయాలా..? అని న్యాయమూర్తులు కొరటాల న్యాయవాదిని ప్రశ్నించింది. వాస్తవానికి కొరటాలదే తప్పు. ఇక్కడి వరకు వచ్చిన తరువాత మహేష్ బాబు ఇన్వాల్వ్ అయినా బాగుండేది. నవలలో దేవరకొండ అని ఉంటే సినిమాలో దేవరకొండ.. అని సినిమాలో వ్యాపారవేత్త అయితే నవలలో మంత్రి. సినిమాలో దత్తత తీసుకుంటే.. నవలలో దత్తత కాకుండా తండ్రి సహాయంతో గ్రామంలో రోడ్లు వేస్తారు. వెన్నెల కిషోర్ పాత్రను కూడా సేమ్ టూ సేమ్ తీశారు. హీరో గ్రామానికి వచ్చి హీరోయిన్ ఇంట్లోనే ఉంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కాపీ కొట్టాడు కొరటాల శివ. గోటితో పోయేదాన్ని.. కొరటాల పరువు తీసుకున్నాడు. తప్పును ఒప్పుకుంటే సరిపోయేది అని పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు పేర్కొంటుండటం గమనార్హం.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!