ప్రస్తుతం వైజాగ్ లోని వైఎస్‌ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం లో ఇండియా, ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య రెండవ టెస్టు మ్యాచ్ హోరాహోరీ వాతావరణంలో జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే నేడు స్టేడియం కి చేరుకోవడం కోసం భరత్, ఇంగ్లాండ్ ప్లేయర్లు APSRTC బస్సులో ప్రయాణించడం చర్చనీయాంసంగా మారింది. సాధారణంగా, అంతర్జాతీయ క్రికెటర్లు హోటల్ నుండి స్టేడియానికి చేరుకునేందుకు వాళ్ళ సౌకర్యం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అత్యుత్తమ-ఇన్-క్లాస్ ప్రైవేట్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తారు.
Advertisement
Advertisement
సమయానికి ఆ బస్సు అందుబాటులో లేదో, లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చిందేమో తెలియదు కానీ రెండు దేశాలకు సంబంధించిన ప్లేయర్లు మాత్రం “డాల్ఫిన్ క్రూయిజ్” లగ్జరీ-క్లాస్ APSRTC బస్సులో ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. అయితే ఈ బస్సులో ప్రయాణించడం వాళ్లకు సరికొత్త అనుభూతిని ఇచ్చినట్టుగా మీడియా తో తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా APSRTC సంస్థ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ చిత్రాలను నెటిజెన్స్ తో పంచుకుంది. ఇంటర్నేషనల్ ప్లేయర్లు మా బస్సు సర్వీస్ ని ఎంజాయ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ @bcci @englandcricket టీమ్స్ ని ట్యాగ్ చేసి ధన్యవాదాలు తెలియచేసింది. దీంతో సోషల్ మీడియా లో ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!