Home » తమన్నాతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన విజయ్ వర్మ..!

తమన్నాతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన విజయ్ వర్మ..!

by Anji
Ad

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ , తమన్నాల రిలేషన్షిప్ కేవలం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ -2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరిద్దరూ తక్కువ సమయంలోనే ప్రేమలో పడినప్పటికీ ఈ విషయాన్ని కూడా ఎక్కువ రోజులు సీక్రెట్ గా ఉంచలేకపోయారు. ఎందుకంటే వీరికి సంబంధించిన పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అవి కాస్తా నెట్టింట్లో వైరల్ అయి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బయటపడింది. అందరు సెలబ్రిటీస్ లాగే వీరు తమ రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచాలి అనుకోలేదు.

Advertisement

Advertisement

ఈ విషయం బయటపడ్డ కొద్ది రోజులకే తాము నిజంగానే ప్రేమలో ఉన్నాము అనే విషయాన్ని చెప్పారు. కానీ పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు అంటూ కూడా చెప్పారు.  తాజాగా విజయ్ వర్మ తమన్నాతో పెళ్లి గురించి ఒక అభిమానికి ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.  హైదరాబాద్ కుర్రాడైన విజయ్ వర్మ బాలీవుడ్ లో నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలా కొనసాగుతున్న ఈయన తమన్నాతో ప్రేమలో పడ్డారు. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఎన్నో ప్రశ్నలు ఆయనను అడిగారు.ఇక అందులో భాగంగా ఒక అభిమాని కబ్ షాదీ కర్రే అంటే మీ పెళ్లెప్పుడు అని అడిగారు.

దానికి విజయ్ వర్మ  ఒక వింత సమాధానం ఇచ్చారు. ఇదే ప్రశ్న నేను హైదరాబాద్ కి వెళ్లినప్పుడు కూడా వినిపించింది. అలాగే నా మేనకోడలు కూడా మా అమ్మను అడుగుతుంది అంటూ పెళ్లి ఎప్పుడో చెప్పకుండా వింత సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. వీరి పెళ్లి ఈ ఏడాది ఉండబోతుందని సమాచారం.

Visitors Are Also Reading