Home » 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Anji
Ad

ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేసే బాధ్యత తమ మంత్రివర్గం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రేవంత్‌ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఇవాళ జరిగిన ఇంద్రవెల్లి సభలో మాట్లాడుతూ..  గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 ఉందని.. త్వరలోనే మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించారు.

Advertisement

Advertisement

అలాగే విద్యుత్‌ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న రేవంత్‌.. త్వరలోనే తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని అన్నారు. యూనిఫామ్‌లు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే అప్పగిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. బీఆర్‌ఎస్‌ నేతలకు ఎందుకు కడుపు నొప్పి అంటూ ప్రశ్నలు కురిపించారు. తమ ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందే.. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు ఎగిరిపడుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీఆర్ఎస్ నేతలు కొందరు నిత్యం తమ ప్రభుత్వాన్ని పడగొడతామని, కూలగొడతామని అంటున్నారని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. తమది ప్రజల ప్రభుత్వమని.. తమ ప్రభుత్వాన్ని కొట్టేవాళ్లెవరూ లేరంటూ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మలో మళ్లీ సీఎం కాదు కదా.. కనీసం మంత్రి కూడా కాలేరని అన్నారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉద్యోగాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి 15 రోజుల్లో 15వేల పోలీస్ ఉద్యోగాలను ఎలా భర్తి చేస్తారని.. నిరుద్యోగులందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు సీఎం కి ఏమైనా తెలివి ఉందా..? 15 రోజుల్లో నోటిఫికేషన్ వేస్తారా..? లేక భర్తీ చేస్తారా..? అనేది క్లారిటీ కూడా లేదని చర్చించుకోవడం గమనార్హం.

మరిన్నీ తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading